Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆరోగ్యకరమైన గుండె కోసం రతిక్రియ ఎంతో ముఖ్యం!

ఆరోగ్యకరమైన గుండె కోసం రతిక్రియ ఎంతో ముఖ్యం!
, సోమవారం, 3 మార్చి 2014 (14:52 IST)
File
FILE
రతిక్రియ ఆరోగ్యానికి చాలా ఉత్తమమైనదని పరిశోధకులు అంటున్నారు. గుండె జబ్బుల నుంచి దూరంగా ఉండాలనుకుంటే క్రమం తప్పకుండా రతిక్రియలో పాల్గొనాలని వారు సలహా ఇస్తున్నారు. నిత్యం రతిక్రియలో పాల్గొంటుంటే గుండె జబ్బులు దరి చేరవని మసాచుసెట్స్‌లోనున్న న్యూ ఇంగ్లాండ్ ఇన్స్‌టిట్యూట్‌కు చెందిన శాస్త్రజ్ఞులు తెలిపారు.

గుండె జబ్బులను నివారించేందుకు వారంలో కనీసం రెండు సార్లు రతిక్రియలో పాల్గొంటుంటే పురుషుల్లో దాదాపు 45 శాతం మేరకు గుండె జబ్బులు తగ్గుతాయని పరిశోధకులు చెపుతున్నారు. అదే వారానికి ఒకసారి లేదా అంతకంటే తక్కువగా రతిక్రియలో పాల్గొనేవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాట్టు వారు హెచ్చరించారు.

తమ పరిశోధనలకు 40 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలలోపు కలిగిన వ్యక్తులు దాదాపు వెయ్యిమందిని పరీక్షించినట్లు పరిశోధకులు తెలిపారు. వీరిని 16 సంవత్సరాలపాటు పరీక్షించి పరిశోధించినట్లు శాస్త్రజ్ఞులు తెలిపారు. తాము నిర్వహించిన పరిశోధనల్లో ఎవరైతే క్రమంగా తమ భాగస్వామితో రతిక్రియలో పాల్గొన్నారో, వారిలో గుండెకు సంబంధించిన వ్యాధులు ఏ కోశానా లేకపోవడం గమనార్హం.

అదేవిధంగా తమ జీవిత భాగస్వామితో నిత్యం ప్రేమ కలాపాలు కొనసాగిస్తూ ప్రేమపూర్వకమైన సంభాషణలు, నిత్యం చిలిపి చేస్టలు కొనసాగించే వారు నిత్యం యవ్వనవంతులుగా కనపడ్డారని పరిశోధకులు తెలిపారు. దీంతో వీరి శరీరంలో వృద్ధాప్యపు ఛాయలుకూడా చాలా వరకు తక్కువగానే కనపడ్డాయని పరిశోధకులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu