Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేసవిలో పుచ్చకాయలు తినండి... రసం తాగండి... ఫోటోగ్యాలెరీ

వేసవిలో పుచ్చకాయలు తినండి... రసం తాగండి... ఫోటోగ్యాలెరీ
, గురువారం, 17 ఏప్రియల్ 2014 (16:46 IST)
WD

ఇది పుచ్చకాయలు విరివిగా దొరికే కాలం. మృదువుగా, తీయగా, రసపూరితమైన పుచ్చకాయ ఈ వేసవికి చాలా ఉపయోగకరమైనది. వాటిని తింటే దాహం తీరిపోతుంది. అందులో సందేహం లేదు. కానీ, వాటిలో యాంటీ ఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా?. పుచ్చకాయల ద్వారా సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్‌లు మీకు లభిస్తాయి. హృదయ సంబంధ వ్యాధులకి, ప్రేగు కేన్సర్‌కి, అలాగే మధుమేహానికి చాలా మంచివని పరిశోధనలు తెలియజేశాయి. వాటిలో ఎ, బి, మరియు సి - విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

webdunia
WD
ఇంకా చెప్పాలంటే తక్కువ కెలోరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి. పుచ్చకాయ జూస్ తాగేందుకు అనువైన పానీయం. ఎందుకంటే, అందులో 92% నీరు ఉంటుంది, పైగా కొలెస్ట్రాల్ లాంటివి అందులో ఉండవు. అది వెంటనే తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే నీటిని కలిగి ఉండడం వల్ల.

webdunia
WD

ఎంపిక : సరియైన పుచ్చకాయను ఎంచుకోవాలి. మచ్చలుగానీ, దెబ్బలుగానీ లేని నిగనిగలాడే పుచ్చకాయను ఎంచుకోవాలి. దాన్ని చుట్టూ తిప్పి చూసినప్పుడు ఒక ప్రక్క మీకు పసుపు రంగు కన్పిస్తుంది. అలా పసుపు రంగు కన్పించడం చాలా మంచి సూచన. ఆ రంగు అది సూర్య కిరణాలలో పండిందని తెలియజేస్తుంది. అది తీయగా, రసభరితంగా ఉంటుందనడానికి కూడా అదే సూచన. పుచ్చకాయను తట్టినపుడు బోలుగా ఉన్నట్టు శబ్దం వస్తే అది పండిందని అర్థం.

webdunia
WD

పుచ్చకాయ పెద్దదిగా ఉంటుందని, రిఫ్రిజిరేటర్‌లో ఎక్కువ చోటుని ఆక్రమించేస్తుందని మీరు ఎప్పుడూ వెనుకాడుతుంటారా?. కానీ, ప్రస్తుతం లెక్కలేనన్ని చిన్న పుచ్చకాయలు మార్కెట్ లో దొరుకుతున్నాయి. కాబట్టి, ఈసారి పండ్ల షాపుకి వెళ్తే పుచ్చకాయ కొనడం మరచిపోకండి.

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu