Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్‌ స్వీట్ దోశ ఎలా తయారు చేస్తారు?

మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్‌ స్వీట్ దోశ ఎలా తయారు చేస్తారు?
, గురువారం, 13 మార్చి 2014 (18:18 IST)
File
FILE
దోశలలో రకాలు అన్నీ ఇన్నీ కాదు. దోశలను చాలా రకాలుగా రుచికరంగా తయారు ఆరగించవచ్చు. దోశలలో కొంచెం కొత్తదనం, వెరైటీ కోరుకునే వారి కోసమే ఈ కొత్తరకం "మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్‌ స్వీట్ దోశ". ఇది చక్కటి రుచిని కలిగి ఉండటమే కాకుండా బ్రేక్‌ఫాస్ట్/స్నాక్‌గా మంచి బలాన్ని కూడా ఇస్తుంది. మరి దీనిని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని పరిశీలిద్దాం.

కావలసిన పదార్థాలు:
ఎండుకొబ్బరి తురుము - అరకప్పు,
గసగసాలు - మూడు టేబుల్ స్పూన్లు,
సరిపడ జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, ఎండుద్రాక్ష, పంచదార (మిక్సీలో వేసి పౌడర్‌లా చేసుకోవాలి)
తగినంత యాలకుల పొడి - రెండు టీ స్పూన్లు, దోశల పిండి (ఉప్పు కలపనిది)

తయారుచేసే విధానం:
జీడిపప్పు, బాదం పప్పు, ఎండుద్రాక్ష, పిస్తాపప్పలను చిన్న చిన్న ముక్కలు అయ్యేలా మిక్సీలో పొడి చేసుకోవాలి. తర్వాత ఒక పాత్రలోకి ఈ మిశ్రమాన్ని తీసుకొని అందులో పంచదార పొడి, యాలకుల పొడి, కొబ్బరి తురును, గసగసాలు వేసి బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు పెనంపై దోశ పిండితో అట్లు వేసుకోవాలి. దానిపై తగినంత డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని, సరిపడా ఆయిల్‌ను వేసి ఒకవైపు మాత్రమే కాల్చి మడత పెట్టుకొని సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకోవాలి. వీటిని వేడి వేడిగా లాగించేస్తే మంచి రుచికరంగా ఉంటాయి. దీంతో తగినంత బలం కూడా వస్తుంది. డ్రై ఫ్రూట్స్ ఉండటం వల్ల పిల్లలు కూడా బాగా ఇష్టపడి తినేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu