చికెన్ సాటె ఎలా తయారు చేస్తారు?
, గురువారం, 17 ఏప్రియల్ 2014 (17:27 IST)
కావలసిన పదార్థాలు :చికెన్ బ్రెస్ట్‌లు... రెండు లెమన్ గ్రాస్... ఒక టీస్పూన్ కొత్తిమీర తరుగు... రెండు టీస్పూన్లుపచ్చిమిరప తరుగు... ఒక టీస్పూన్చింతపండు గుజ్జు... ఒక టీస్పూన్ధనియాలపొడి... అర టీస్పూన్నువ్వుల నూనె... అర టీస్పూన్రిఫైండ్ ఆయిల్... ఒక టీస్పూన్కొబ్బరిపాలు... సరిపడ ఉప్పు... తగినంతతయారీ విధానం :చికెన్ బ్రెస్ట్ ముక్కలకు లెమన్ గ్రాస్, కొత్తిమీర తరుగు, పచ్చిమిరప తరుగు, చింతపండు గుజ్జు, ధనియాలపొడి, నువ్వుల నూనె, రిఫైండ్ ఆయిల్, కొబ్బరిపాలు, తగినంత ఉప్పు కలిపి ఒక గంటసేపు మారినేడ్ (అన్నింటినీ బాగా కలిపి ఉంచడం) చేసుకోవాలి.తరువాత చికెన్ బ్రెస్ట్ ముక్కలను రెండు అంగుళాల పొడవుగా కోసుకోవాలి. వీటిని పుల్లలకు గుచ్చి గ్రిల్ చేసుకోవాలి. గ్రిల్ అందుబాటులో లేనట్లయితే... బొగ్గులపై కాల్చి, తందూరీలాగా చేసుకోవచ్చు. గ్రిల్ చేసుకున్న వాటిని గోల్డ్ కలర్ వచ్చేదాకా కాల్చి తీసేయాలి... అంతే చికెన్ సాటె రెడీ అయినట్లే..! వీటిని పీనట్ సాస్‌తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.