Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హెల్దీ బ్రేక్ ఫాస్ట్ ఎగ్ చీజ్ రోల్స్‌ మీ కోసం..

హెల్దీ బ్రేక్ ఫాస్ట్ ఎగ్ చీజ్ రోల్స్‌ మీ కోసం..
FILE
మీరు తీసుకునే ఆహారంలో పోషకాలు మినరల్స్, విటమిన్స్ ఉండేలా చూసుకోండి. సాధారణంగా కోడి గుడ్డు అంటే చిన్న పిల్లల నుండి పెద్దల వరకూ ప్రతి ఒక్కరి చాలా ఇష్టం. ఈ హెల్తీ ఆహారంతో పాటు డైరీప్రొడక్ట్ అయిన చీజ్‌ను కూడా మీ బ్రేక్ ఫాస్ట్‌లో చేర్చుకుంటే మరింత శక్తితో పాటు టేస్టు కూడా అదిరిపోద్ది. సో.. ఎగ్ విత్ చీజ్ రోల్ ఎలా చేయాలో ట్రై చేద్దామా..

కావలసిన పదార్థాలు
కోడిగుడ్డు - నాలుగు
చీజ్ - 10 ముక్కలు
అల్లం పేస్ట్ - ఒక స్పూన్
కారం- ఒక టేబుల్ స్పూన్
ఛాట్ మసాలా - ఒక టేబుల్ స్పూన్
బటర్- రెండు టేబుల్ స్పూన్లు
నూనె- తగినంత
ఉల్లిపాయ తరుగు - ఒక కప్పు
కార్న్ ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు
బ్రెడ్ ముక్కలు - 12 ముక్కలు

తయారీ విధానం :
ముందుగా ఒక బౌల్‌లో కోడిగుడ్డును పగులగొట్టి బాగా బీట్ చేసుకోవాలి. అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, మరియు అల్లం తురుము వేయాలి. గుడ్డు మిశ్రమంతో పాటు, వీటన్నింటినీ బాగా గిలకొట్టాక అందులో చాట్ మసాలా వేసి మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా చిక్కగా తయారైన మిశ్రమాన్ని పక్కనబెట్టుకుని.. మరో బౌల్ బౌల్ తీసుకొని అందులో కార్న్ ప్లోర్ వేసి, కొద్దిగా నీళ్ళు పోసి బాగా మిక్స్ చేసి కలిపి పెట్టుకోవాలి. తర్వాత బ్రెడ్స్ స్లైస్‌ను తీసుకొని వాటి మీద ఒక్కో చీజ్ స్లైస్ పెట్టాలి.

బ్రెడ్‌కు చీజ్ రాసిన తర్వాత, దాని మీద ముందుగా మిక్స్ చేసి పెట్టుకొన్న గుడ్డు మిశ్రమాన్ని అమర్చాలి. తర్వాత చిక్కగా కలుపుకొన్న కార్న్ ఫ్లోర్‌తో బ్రెడ్ అంచులను కవర్ చేస్తూ రోల్ చేయాలి.
ఇలా అన్ని బ్రెడ్ స్లైస్ మరియు అన్ని చీజ్ స్లైతో అన్ని రోల్స్ చేసి సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు పాన్‌లో కొద్దిగా నూనె రాసి వేడి చేయాలి. తర్వత బ్రెడ్ రోల్స్‌ను పాన్ మీద వేసి మీడియం మంట మీద బ్రెడ్ రోల్స్ ను ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. ఇలా తయారైన తర్వాత వాటిని తీసి నూనె పీల్చుకొనే పేపర్ మీద వేయాలి. ఈ ఎగ్ చీజ్ రోల్స్‌ను టమోటో సాస్ లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేయండి.

Share this Story:

Follow Webdunia telugu