Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు చేపల కథ

Webdunia
సోమవారం, 23 ఫిబ్రవరి 2009 (18:39 IST)
ND
అనగనగా ఒక చెరువులో మూడు చేపలు ఉండేవి. అసలే ఎండాకాలం, చెరువులో ఎప్పటికప్పుడు నీళ్లు తగ్గిపోతుండటంతో చేపలన్నీ చచ్చిపోతున్నాయి. దీంతో కలత చెందిన మూడు చేపలు ఒకచోట సమావేశమైనాయి.
ముందుచూపు ముఖ్యం
  ఈ కథ ద్వారా మీకు అర్థం చేసుకోవాల్సిన నీతి ఏంటంటే... మొదటగా ముందుచూపుతో ఆలోచించటం నేర్చుకోవాలి. ఏదైనా అపాయం వచ్చినప్పుడు ఉపాయం ఆలోచించగలిగి, తప్పించుకునే తెలివితేటలు కలిగి ఉండాలి. లేకపోతే మన పరిస్థితి కూడా మూడో చేప పరిస్థితి లాగా అయిపోతుంది...      


" అయ్యో.. ఈ సంవత్సరం ఇప్పటిదాకా వానలే పడటం లేదు. మన చెరువులో చూస్తే... నీళ్ళు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఈరోజు కొంతమంది జాలర్లు వచ్చి, ఇంకో పది రోజుల్లో నీళ్ళన్నీ ఇంకిపోతాయి. అప్పుడు వచ్చి ఈ చేపలన్నింటినీ వలవేసి పట్టుకెళ్లిపోవచ్చు అని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడే ఉంటే మనం చచ్చిపోవడం ఖాయం" అని అనుకున్నాయి.

మొదటి చేప మాట్లాడుతూ... ఇక్కడికి దగ్గర్లోనే ఇంకో పెద్ద చెరువు ఉంది, మనందరం అక్కడికి వెళ్లిపోదాము అని అంది. ఇది విన్న రెండో చేప... "సర్లే ఆ జాలర్లు వచ్చినప్పుడు కదా మనకి అపాయం. అప్పటిదాకా ఖంగారు పడాల్సిందేమీలేదు" అని తేల్చి చెప్పింది.

ఇక మూడో చేప... "నీళ్ళు ఇంకిపోయినప్పుడు, జాలర్లు వచ్చినప్పుడు కదా... ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం ఇప్పట్లో లేదంటూ" ఎంచక్కా వెళ్లిపోయింది.

ఎంతచెప్పినా మిగతా రెండు చేపలు వినక పోవడంతో... మొదటి చేప ఆ రాత్రికి రాత్రే నెమ్మదిగా దొర్లుకుంటూ పక్కనే కొద్ది దూరంలో ఉన్న పెద్ద చెరువులోకి వెళ్లిపోయింది. అలా కొన్ని రోజులు గడిచాయి.

చెరువులో నీళ్లు ఇంకిపోసాగాయి. అది తెలిసిన జాలర్లు వల తీసుకుని చెరువుకు వచ్చారు. జాలర్లను చూసిన రెండో చేప కాస్తంత తెలివిగా ఆలోచించి చచ్చిన దానిలాగా పడుకుంది. ఛీ..ఛీ చచ్చిపోయిన చేప మనకెందుకులే అనుకుంటూ జాలర్లు ఎత్తి దూరంగా విసిరి పారేశారు. జాలర్లు విసిరిన విసుర్లో... అది పక్కనే ఉన్న చిన్న నీటి కొలనులో పడి ప్రాణాలు దక్కించుకుంది.

ఇక చెప్పిన మాట వినని మూడో చేప మాత్రం వలలో పడి గిజ గిజ తన్నుకుంటూ జాలర్ల కంట్లో పడింది. ఆహా ఎంత పెద్ద చేపో... భలేగా వలలో పడిందని వాళ్లు సంతోషిస్తూ... ఇంటికి తీసుకెళ్లి వండుకుని తినేశారు.

కాబట్టి పిల్లలూ...! ఈ కథ ద్వారా మీకు అర్థం చేసుకోవాల్సిన నీతి ఏంటంటే... మొదటగా ముందుచూపుతో ఆలోచించటం నేర్చుకోవాలి. ఏదైనా అపాయం వచ్చినప్పుడు ఉపాయం ఆలోచించగలిగి, తప్పించుకునే తెలివితేటలు కలిగి ఉండాలి. లేకపోతే మన పరిస్థితి కూడా మూడో చేప పరిస్థితి లాగా అయిపోతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మాజీ సీఎం జగన్‌పై మరో కేసు నమోదు

పెళ్లై నెల రోజులే: గద్వాలలో భర్తను చంపి అతడి మృతదేహంతో కారులో భార్య, ప్రియుడు (video)

Dogs diving at the Olympics: స్విమ్మింగ్ పూల్‌లో డైవ్ చేసి ఎంచక్కా దూకేస్తున్న శునకాలు (వీడియో)

రైలు ప్రయాణికుడిపై దాడి ఘటన : బీజేపీ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు

అంజనాదేవికి అస్వస్థత .. కేబినెట్ మీటింగ్ నుంచి అర్థాంతరంగా పవన్ నిష్క్రమణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

Show comments