Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోటోరోలా మొబిలిటీ నుంచి 4జి, 3జి మొబైల్స్

మోటోరోలా మొబిలిటీ నుంచి 4జి, 3జి మొబైల్స్
, గురువారం, 21 మే 2015 (15:26 IST)
మొబైల్ ఫోన్ల తయారీలో ప్రముఖ కంపెనీగా ఉన్న మోటోరోలా కంపెనీ తాజా 4జి, 3జి విభాగాల్లో రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్లను అత్యాధునిక ఫ్యూచర్లతో తయారు చేశారు. ఇందులో 4జి మొబైల్ ధరను రూ.7999గా నిర్ణయించగా, 3జి మొబైల్ ధరను రూ.6999గా నిర్ణయించారు. ఈ రెండు రకాల మొబైల్స్‌ను కేవలం ఆన్‌లైన్ ట్రేడింగ్ కంపెనీ ఫ్లిప్‌‌కార్ట్‌లోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
 
ఈ రెండు మొబైల్స్‌లలో 4.5 అంగుళాల క్యూహెచ్‌డి డిస్ప్లే, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, సరికొత్త లాలీపాప్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌, 5 మెగాపిక్సెల్ రేర్ కెమెరాను అమర్చారు. ముఖ్యంగా, ఇందులో అమర్చిన కెమెరా స్విచాన్ బటన్ కేవలం షేక్ చేయడంతోనే ఆనయ్యేలా ఏర్పాటు చేశారు. దీనివల్ల అత్యవసర సమయాల్లో క్షణాల్లో ఫోటోలు తీసుకునే వెసులుబాటు లభిస్తుంది. 
 
భారత్‌లో తమ మొబైల్ విక్రయాలను గత యేడాది ఫిబ్రవరి నెలలో ప్రారంభించగా, తమ మార్కెట్ ఆశాజనకంగా ఉంది. అయితే, ప్రస్తుత మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ యేడాది మొబైల్ సేల్ విక్రయాల్లో టార్గెట్‌ను నిర్ధేశించుకోలేదని ఆ కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. అలాగే, తమ విక్రయాలను పెంచుకునేందుకు వీలుగా మరిన్ని సర్వీస్ సెంటర్లను ప్రారంభించనుంది. ప్రస్తుతం ఈ కంపెనీకి 115 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu