సెల్ ఫోన్ కిందపడితే... ఎయిర్ బెలూన్లు తెరుచుకుంటాయి...
ముంబై : ఖరీదైన స్మార్ట్ ఫోన్ పొరపాటు కిందపడితే... ఇంకేమైనా ఉందా? మన గుండె గుభేలుమంటుంది. సెల్ ఫోన్ స్క్రీన్ పగిలిందా? అసలు ఫోనే పనిచేయడం ఆగిపోయిందా? పాడైపోయిందా?... అయ్యో ఖరీదైన ఫోన్ అంటూ తెగ బాధపడిపోతాం. ఇలాంటి ప్రమాదాలకు చెక్ పెడుతూ, క
ముంబై : ఖరీదైన స్మార్ట్ ఫోన్ పొరపాటు కిందపడితే... ఇంకేమైనా ఉందా? మన గుండె గుభేలుమంటుంది. సెల్ ఫోన్ స్క్రీన్ పగిలిందా? అసలు ఫోనే పనిచేయడం ఆగిపోయిందా? పాడైపోయిందా?... అయ్యో ఖరీదైన ఫోన్ అంటూ తెగ బాధపడిపోతాం. ఇలాంటి ప్రమాదాలకు చెక్ పెడుతూ, కొత్తగా సెల్ ఫోన్లకూ ఎయిర్ బ్యాగ్‌లు వచ్చేస్తున్నాయి.
జపాన్‌కు చెందిన హోండా కంపెనీ వీటిని తయారుచేసింది. కార్ల తయారీలో పేరుగాంచిన హోండా కంపెనీ, కార్లలో లాగానే స్మార్ట్ ఫోన్ల కోసం ఎయిర్ బ్యాగ్స్‌ను తయారుచేసింది. స్మార్ట్ ఫోన్లో ఇన్‌బిల్ట్‌గా వచ్చే ఈ సౌకర్యాన్ని కేస్ ఎన్... అని పిలుస్తారు. ఈ పరికరం స్మార్ట్ ఫోన్‌కి రక్షణ కవచంలా పనిచేస్తుంది. మీ స్మార్ట్ ఫోన్ కింద పడిన వెంటనే ఆరు ఎయిర్ బ్యాగులు తెరుచుకుంటాయి. దీంతో స్మార్ట్ ఫోన్ భద్రంగా ఉంటుంది.
యాపిల్ కంపెనీ ఈ తరహా డిజైన్ ఒకటి తయారుచేయాలని కోరడంతో కేస్ ఎన్‌ను రూపొందించామని హోండా కంపెనీ తెలిపింది. దీనిని మరింత డెవలప్ చేసి, మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. దీనితో ఇక మీ సెల్ ఫోన్ సేఫ్.