Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిల్లల్లో దేశభక్తి భావం పెంపొందాలి: శ్రీహరి

పిల్లల్లో దేశభక్తి భావం పెంపొందాలి: శ్రీహరి
WD

పిల్లల్లోనే దేశభక్తి భావం పెంపొందించాలి. అప్పుడే దేశానికి సరైన పౌరులుగా ఎదుగుతారు. "భారత దేశం నా మాతృభూమి." "భారతీయులందరూ నా సహోదరులు.." అనే కంటే "ప్రపంచీయులంతా నా సహోదరులు.." అనే భావం నాటుకుంటే దేశంలో టెర్రరిజాన్ని రూపుమార్చవచ్చు. పిల్లలు చేసే ప్రతిజ్ఞలో మార్పు రావాలంటూ.. రియల్ స్టార్ శ్రీహరి అంటున్నారు.

గతంలో కె.ఎస్. నాగేశ్వర రావు దర్శకత్వంలో "సాంబయ్య", "దేవా" వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన శ్రీహరి తాజాగా "శ్రీశైలం" చిత్రంలో నటించారు. రాందాసు నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా శ్రీహరితో కాసేపు...

ప్రశ్న.. "శ్రీశైలం"లో ప్రత్యేకమేమని భావిస్తున్నారు..?
జ.. కథ, స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. నా పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. సంగీతపరంగా చాలా బాగుంది. ఐదు పాటలున్నాయి. యాక్షన్ చిత్రమైనా మరోవైపు ప్రేమకథ కూడా ఉంటుంది.

ప్రశ్న.. "శ్రీశైలం"ను ఎటువంటి కథగా తీర్చిదిద్దారు..?
జ.. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను ఇతివృత్తంగా ఎంచుకున్నాం. అది బ్యాక్‌గ్రౌండ్ మాత్రమే. చివర్లో సందేశం కూడా ఉంటుంది. "జీహాద్ కన్నా జైహింద్" అని గొప్పగా చెబుతాం. ప్రతి పౌరుడు ఓ సైనికుడిగా, పోలీసు ఆఫీసర్‌గా భావించి నడుం కడితే దేశద్రోహులను తరిమి కొట్టొచ్చు.

ప్రశ్న... "విజయరామరాజు"లో కూడా దేశభక్తి ఉంది కదా..?
జ.. అందులో ఒక భాగం మాత్రమే. "భద్రాచలం"లో కూడా చివర్లో దేశభక్తి ఉంటుంది. కానీ "శ్రీశైలం"లో మాత్రం స్క్రీన్‌ప్లే ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. దేశభక్తిని చిన్నప్పటి నుంచే మనం పిల్లలకు నేర్పాలి. దాన్ని ప్రభుత్వాలు అమలు చేయించాలి. ఏదో మొక్కుబడిగా ప్రతిజ్ఞ చేస్తే సరిపోదు. భావిపౌరులుగా తీర్చిదిద్దితేనే వారు దేశానికి నిజమైన వెన్నెముకలవుతారు. ఈ చిత్రంలో కృష్ణంరాజు, నాగబాబు పాత్రలు హైలైట్‌గా ఉంటాయి. రామ్‌కిరణ్, సుహాని యువ జంటగా నటిస్తున్నారు.

ప్రశ్న... ఢీ, కింగ్ చిత్రాల్లో ఎంటర్‌టైన్‌మెంట్ బాగా చేశారు. ఈ చిత్రంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు..?
జ... ఆ రెండు చిత్రాల తర్వాత అంతా నానుంచి కామెడీ ఆశిస్తున్నారు. అందుకే ఈ చిత్రంలోనూ ఆ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. బ్రహ్మానందం, వేణుమాధవ్ కాంబినేషన్‌లో కామెడీ అద్భుతంగా వచ్చింది.

ప్రశ్న... కాశ్మీర్‌లో షూటింగ్ ఎలాంటి అనుభూతినిచ్చింది?
జ... కథను బట్టి కాశ్మీర్ వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ 20 రోజుల పాటు షూటింగ్ చేశాం. టెర్రరిజం బ్యాక్‌డ్రాప్ ఎపిసోడ్, ఓ పాటను అక్కడ చిత్రించాం. మేం షూటింగ్ చేసిన టైమ్‌లో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదు.

ప్రశ్న... హీరోయిన్ పాత్ర ఎలా ఉంటుంది..?
జ... ఆమె కాలేజీలో ఫిజికల్ డైరక్టర్. ఆ పాత్రను చాలా నచ్చి చేసింది. ఇందులో నేను బస్‌డ్రైవర్ని.

ప్రశ్న... "శ్రీశైలం" హైలైట్స్ గురించి..?
జ.. యాక్షన్, కామెడీ, డైలాగ్సే శ్రీశైలం హైలైట్స్.

ప్రశ్న... కొత్త సినిమాలు..?
జ... ప్రస్తుతం చరణ్ సినిమా చేస్తున్నాను. అందులో రెండు పాత్రలు. ఒకటి పూర్వజన్మది. 400 ఏళ్ళక్రితం నాటి పాత్రకు... ఈనాటి పాత్రను అన్వయిస్తూ చరణ్ చక్కగా చిత్రిస్తున్నారు. మరో కొన్ని చిత్రాలు పరిశీలనలో ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu