అందుకే పుతిన్ భారత్ వెళ్తాడు, పాకిస్తాన్‌కు రాడు: పాక్ జర్నలిస్ట్, షాక్‌లో పాక్ జనం

ఐవీఆర్
శనివారం, 6 డిశెంబరు 2025 (16:46 IST)
కర్టెసి-ట్విట్టర్
మన దేశం మీద నుంచే వెళ్లారు, కానీ మన దేశంలో మాత్రం కాలు పెట్టరు. ఆయనే రష్యా అధ్యక్షుడు. ఇంతకీ ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నది ఎవరో కాదు, పాకిస్తాన్ ప్రజలే. ఎందుకు ఇంతవరకూ ఏ ఒక్క రష్యా అధ్యక్షుడు పాకిస్తాన్ దేశానికి పనిగట్టుకుని రావడంలేదు అని అడుగుతున్నారట. దీనికి ఆ దేశంలోని జర్నలిస్ట్ ఓ ఇంటర్వ్యూ ద్వారా చాలా విపులంగా సమాధానమిచ్చాడు. ఇంతకీ ఆయన ఏం చెప్పాడో తెలుసుకుందాము.
 
పాకిస్తాన్ జర్నలిస్ట్, మానవ హక్కుల కార్యకర్త కజ్మీ రష్యా అధ్యక్షుడు ఎందుకు రావడంలేదో చెప్పాడు. పాకిస్తాన్ దేశం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది, మన అధ్యక్షుడు విదేశాలకు అప్పులు అడిగేందుకే వెళ్తాడు. అలాంటప్పుడు రష్యా అధ్యక్షుడు ఇక్కడికి ఎందుకు వస్తాడు? తన జేబు ఖాళీ చేసుకుని వెళ్లడానికా? మనం పుతిన్‌ను ఆహ్వానించి ఏం చెప్తాం, ఏమని అడుగుతాం? అయ్యా మాకు ఆయిల్ అప్పుగా ఇ్వవండి, ఫైటర్ జెట్లను పంపండి కానీ డబ్బులు ఇప్పుడు ఇవ్వం, వడ్డీ లేని రుణాలు ఇవ్వండి మావద్ద డబ్బు వున్నప్పుడు కడుతాం అని చెప్తామా? అవి చెప్పించుకుని వినేందుకు పుతిన్ ఇక్కడికి వస్తారా ఏంటి?
 
అదే భారతదేశాన్ని చూడండి. డబ్బు చెల్లించి సరుకులు, చమురు కొనుగోలు చేస్తోంది. అంతేకాదు, భారతదేశంలో మేధస్సు వున్న యువతను రష్యా గుర్తించింది, అందుకే తమ దేశంలో పనిచేసేందుకు అక్కడి యువతకు అవకాశాలను కల్పిస్తామని పుతిన్ ముందుకు వచ్చి చెబుతున్నారు. కనుక భారతదేశంలా మనం కూడా ఆర్థికంగా వృద్ధి సాధిస్తే ఏ దేశమైనా మనతో మాట్లాడాలనీ, మన దేశం వైపు చూస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇపుడీ ఇంటర్వ్యూ తాలూకు వీడియోను చూసిన పాక్ ప్రజలు షాక్ తింటున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళగా పుట్టినందుకు గర్వంగా ఉంది : జాన్వీ కపూర్

Sharva: సంక్రాంతికి శర్వా చిత్రం నారి నారి నడుమ మురారి గ్రాండ్ రిలీజ్

NTR, Balayya: ఒకప్పడు అబ్బాయి, ఇప్పుడు బాబాయ్ కి సినిమా రిలీజ్ కస్టాలు

అఖండ 2 కు లాబాలు వచ్చినా ప్రొడ్యూసర్స్ కు అనుకోని ఆటంకాలు

ప్రేమించి మోసం చేసేవాళ్ళకు పుట్టగతులుండవ్ : నటి ఇంద్రజ శాపనార్థాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments