Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఎన్నికల్ని రద్దు చేయండి.. విజేతగా ప్రకటించండి..

అమెరికా అధ్యక్ష ఎన్నిక పదవికి నవంబరు 8న ఎన్నికలు జరగనుండగా, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్‌ ట్రంప్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. పదేళ్ల క్రితం ఆయన తనను లైంగికంగ

Advertiesment
ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఎన్నికల్ని రద్దు చేయండి.. విజేతగా ప్రకటించండి..
, శుక్రవారం, 28 అక్టోబరు 2016 (10:42 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నిక పదవికి నవంబరు 8న ఎన్నికలు జరగనుండగా, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్‌ ట్రంప్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. పదేళ్ల క్రితం ఆయన తనను లైంగికంగా వేధించారని అశ్లీల చిత్రాల నటి జెస్సికా డ్రేక్‌ ఇటీవలే ఆరోపించారు. ట్రంప్‌పై లైంగిక ఆరోపణలు చేసిన వారిలో ఆమె 11వ మహిళ కావడం గమనార్హం.
 
2006లో నెవడాలో విరాళా సేకరణ కోసం గోల్ఫ్‌ పోటీలు నిర్వహించిన సందర్భంగా తనను, తన స్నేహితురాలిని గట్టిగా దగ్గరకు లాక్కొని ముద్దుపెట్టారని ఆరోపించారు. ఇబ్బంది అనిపించడంతో దాదాపు అరగంట తరువాత అక్కడి నుంచి వచ్చేశామన్నారు. పదివేల డాలర్లు ఇవ్వడంతో పాటు, సొంత జెట్‌ విమానం వాడుకొనే సౌకర్యం కల్పిస్తామని కూడా చెప్పారని ఆరోపించారు. ఈ ఆరోపణలను ట్రంప్‌ ప్రచార నిర్వాహకులు తోసిపుచ్చారు.
 
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికలను వెంటనే రద్దు చేయాలని... తనను విజేతగా ప్రకటించాలన్నారు. ఎన్నికల్లో హిల్లరీ పార్టీ వారు రిగ్గింగ్ చేస్తారని... మీడియాతో పాటు ఇప్పటికే పాతుకుపోయిన నేతలంతా తన వెనుక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలకు మరో రెండు వారాల గడువు మాత్రమే ఉన్న సమయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జేషే చీఫ్ మసూద్ అజహర్ ఉగ్రవాదే : తొలిసారి నిజం చెప్పిన ముషారఫ్