Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహిళకు ముద్దు పెట్టిన వృద్ధుడికి ఎనిమిది నెలల జైలు

మహిళకు ముద్దు పెట్టిన వృద్ధుడికి ఎనిమిది నెలల జైలు
, శనివారం, 25 అక్టోబరు 2014 (12:16 IST)
విమానంలో మహిళకు ముద్దు పెట్టిన ఎన్నారై దేవేందర్ సింగ్ (62)కి యూఎస్ కోర్టు ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది. ల్యూసియానా నివసిస్తున్న ఎన్నారై దేవేందర్ సింగ్ సెప్టెంబర్‍లో  హ్యూస్టన్ నుంచి నెవార్క్కు యూనైటెడ్ ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో ఆయన పక్కనే కూర్చుని నిద్రిస్తున్న మహిళకు ముద్దు పెట్టి, ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. 
 
దీంతో దిగ్భ్రాంతి చెందిన ఆ మహిళ నిద్ర నుంచి మొల్కొన్న, విమానంలోని సిబ్బందికి ఫిర్యాదు చేసింది. అనంతరం విమానం ఎయిర్పోర్ట్ చేరగానే పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ కేసు శుక్రవారం విచారణకు రాగా దేవేందర్ సింగ్కు ఎనిమిది నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu