Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలి టోపీ కోసం 1640 అడుగుల లోయను లెక్కచేయని రియల్ హీరో.. ఏం చేశాడంటే?

ప్రియురాలి కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడతారు వెండితెర హీరోలు. కాని నిజజీవితంలో వెండితెర హీరోలనే మించి పోయాడు ఓ చైనా కుర్రోడు. కేవలం ఒక టోపీ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సాహసానికి పూనుకున్నాడు. ప

Webdunia
బుధవారం, 29 జూన్ 2016 (15:13 IST)
ప్రియురాలి కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడతారు వెండితెర హీరోలు. కాని నిజజీవితంలో వెండితెర హీరోలనే మించి పోయాడు ఓ చైనా కుర్రోడు. కేవలం ఒక టోపీ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సాహసానికి పూనుకున్నాడు. ప్రియురాలు ధరించిందన్న ఒక్క కారణం చేత కొండనుండి కిందపడిపోయిన టోపిని తీసుకొచ్చిచ్చాడు.
 
వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ చైనాలోని జింజి పర్వతాల అందాలను చూడ్డానికి ఒక ప్రేమ జంట అక్కడికి వచ్చింది. అక్కడ వీచిన బలమైన గాలులకు ప్రియురాలి టోపీ ఎగిరి కొండ అంచులో పడిపోయింది. ఆ టోపీ పోయిందని ప్రియురాలు ఎక్కడ బాధపడుతుందేమోనని ప్రాణాలకు తెగించి మరీ టోపీని తీసుకొచ్చాడు ప్రియుడు. పట్టు తప్పితే అతడు 1640 అడుగుల లోతులోని లోయలో పడిపోయే అవకాశం ఉన్నా ఆమె మీద ఉన్న ప్రేమతో టోపీని తీసుకొని కొండెక్కాడు.
 
ఈ ప్రేమికుడు చేసిన సాహసం అక్కడివారిని అబ్బురపరిచింది. కొండపైకి వస్తున్న అతన్ని అక్కడి వారు చప్పట్లతో అభినందించారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న ఆ పర్యాటక ప్రదేశంలోని అధికారులు మాత్రం ఇలాంటి చర్యలు ఏ మాత్రం సమర్థనీయం కాదని, చర్యలు తీసుకుంటామంటున్నారు. అంత కష్టపడి క్యాప్ తీసుకొచ్చిన ఆ కుర్రాడి శ్రమ ఊరికే పోకుండా ప్రియురాలు అతడిని అమాంతంగా గుండెలకు హత్తుకుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చరిత్ర సృష్టించి 13 వారాల పాటు ట్రెండ్ అయిన లక్కీ భాస్కర్ చిత్రం

కోలీవుడ్‌లో వరుస ఛాన్సులు దక్కించుకుంటున్న పూజా హెగ్డే

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర విడుదలకు సిద్దమైంది

Pooja Hegde: రజనీకాంత్ కూలిలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ కు భారి డిమాండ్ !

dubai: టాలీవుడ్ ప్రముఖులు తరచూ దుబాయ్ వెళ్ళేది అందుకేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments