Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డ్రైవింగ్ చేస్తూ.. కారు కింద పడిన మహిళ... ఎక్కడ?

సాధారణంగా కొన్ని రోడ్డు ప్రమాదాలు ఎవరూ ఊహించని విధంగా జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదమే ఒకటి తాజాగా జరిగింది. ఓ యువతి కారు డైవింగ్ చేస్తూ అదే కారు కింద పడి గాయాల పాలైన ఘటన ఒకటి అమెరికాలో జరిగింది. ఈ వివర

డ్రైవింగ్ చేస్తూ.. కారు కింద పడిన మహిళ... ఎక్కడ?
, మంగళవారం, 16 ఆగస్టు 2016 (16:11 IST)
సాధారణంగా కొన్ని రోడ్డు ప్రమాదాలు ఎవరూ ఊహించని విధంగా జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదమే ఒకటి తాజాగా జరిగింది. ఓ మహిళ కారు డైవింగ్ చేస్తూ అదే కారు కింద పడి గాయాల పాలైన ఘటన ఒకటి అమెరికాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
వాషింగ్టన్‌లోని బర్లింగ్టన్‌లో ఓ మహిళ తన కారుకు గ్యాస్ నింపించుకొని తిరిగి కారు స్టార్ట్ చేసింది. కారు ఓ జంక్షన్ వద్దకు వెళ్లాక కారు గ్యాస్ ట్యాంక్ మూతపెట్టానో లేదో అని కిందికి దిగింది. అయితే, కారు ఇంజిన్ ఆపకుండా అలా గేర్లో ఉంచే కిందికి దిగడంతో అది కాస్త ముందుకు కదలడం ప్రారంభించింది. 
 
దీంతో తిరిగి తన కారులోకి వెళ్లేందుకు ప్రయత్నించి అదే కారు కిందపడింది. ఆ కారు తన కాలుపై నుంచి వెళ్లి అలా నెమ్మదిగా కూడలి దాటుకుంటూ అవతలి వైపు ఉన్న చెట్టుకు ఢీకొట్టి ఆగిపోయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుష్క‌ర స్నానానికి వెళ్ళి... ఐదుగురు విద్యార్థుల జలసమాధి