Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

86 ఏళ్ల సన్యాసినిపై సామూహిక హత్యాచారం.. ఆపై హత్య..!

86 ఏళ్ల సన్యాసినిపై సామూహిక హత్యాచారం.. ఆపై హత్య..!
, గురువారం, 23 ఏప్రియల్ 2015 (16:53 IST)
దక్షిణాఫ్రికాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. 86 ఏళ్ల వృద్ధ సన్యాసిపై ఒక దోపిడీ దొంగల ముఠా సామూహికంగా అత్యాచారం చేసి, ఆ పై హత్య చేసి, పరారైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దక్షిణాఫ్రికాలోని ఇక్సోఫో నగరంలో సేక్రెట్ హార్ట్ కాన్వెంట్‌లో ఆస్ట్రేలియా దేశానికి చెందిన కొందరు క్రైస్తవ సన్యాసినిలు బస చేసి ఉన్నారు. 
 
వారు ఉన్న భవనంలోకి అర్థరాత్రి చొరబడిన గుర్తు తెలియని ముఠా అక్కడ నిద్రిస్తున్న 86 ఏళ్ళ వయస్సు గల కెథ్రన్ డిపెన్ పేసర్ అనే వృద్ధ సన్యాసి చేతులు, కాళ్లు కట్టేసి, ఆమెను దారుణంగా సామూహిక అత్యాచారం జరిపి, ఆ తర్వాత ఆమెను హత్య చేసింది. అనంతరం అక్కడ ఉన్న డబ్బును దోచుకుని ఆ ముఠా అక్కడి నుంచి పరారైనట్టు తెలుస్తోంది. సేక్రెట్ హార్ట్ కాన్వెంట్ 1923వ ఏడాది నుంచి నడుస్తోంది. అక్కడ కేథలిక్ మహిళలకు సన్యాసిని శిక్షణ ఇస్తుండడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

Share this Story:

Follow Webdunia telugu