మన ఆరోగ్యానికి పసుపు ఎంత మేలు చేస్తుందో ప్రతి ఒక్కరికీ తెలుసు. పసుపులో సంప్రదాయక ఔషధ గుణాలతో పాటు ఆరోగ్యానికి మరింత దోహదపడుతుందని రకరకాల పరిశోధనల్లో కూడా నిర్ధారణ అయింది. అలాంటి పసుపు ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తుందో ఓ సారి పరిశీలిస్తే.. ఆరోగ్యానికి మేలు శరీరంలో కంటితోపాటు వాపునకు సంబంధించిన సమస్యలకు పసుపు స్టెరాయిడ్ ఔషధంలా పనిచేస్తుంది.
మనిషిలోని ఒత్తిడిని తగ్గించే లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. పసుపులో ఉన్న కుర్‌క్యుమిన్ అనే పదార్థం వల్ల రక్తాన్ని పలుచబరుస్తుంది. పసుపు యాంటీ ప్లేట్‌లెట్‌లా యాంటీ ఆర్థరైటిస్ థెరపీకి పనిచేస్తుందని తేలింది. శరీరంలో ట్యూమర్ సెల్స్ వల్ల వచ్చే వాపును తగ్గించేందుకు పసుపు ఉపయోగపడుతుందన్నారు. పసుపులో ఉన్న కుర్‌కుమిన్ అనే పదార్థం కీమోథెరపీ మందులా పనిచేస్తుంది. ముఖ్యంగా.. మధుమేహాన్ని సమర్థవంతంగా నియంత్రించడానికి ఎంతగానో దోహదపడుతుందని అనేక పరిశోధనల్లో నిరూపితమైంది.