Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రిచర్డ్‌ శామ్యూల్‌ అటెన్‌బరో ఎపిక్‌గా నిలిచిన "గాంధీ"

రిచర్డ్‌ శామ్యూల్‌ అటెన్‌బరో ఎపిక్‌గా నిలిచిన
, మంగళవారం, 26 ఆగస్టు 2014 (09:36 IST)
ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు, నటుడు, ‘గాంధీ’ వంటి మహోన్నత చిత్ర రూపకర్త, మరో వారం రోజుల్లో 91వ పుట్టినరోజు జరుపుకోవాల్సిన రిచర్డ్‌ శామ్యూల్‌ అటెన్‌బరో కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతూ, అమెరికన్‌ కాలమానం ప్రకారం ఆదివారం తుది శ్వాస విడిచారు. దర్శకుడిగా ఆయనకు చిరకాల కీర్తిని దక్కించిన సినిమా నిస్సందేహంగా ‘గాంధీ’ అని చెప్పొచ్చు. 
 
అహింసనూ, సత్యాగ్రహాన్నీ ఆయుధాలుగా మలచుకుని, భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సముపార్జించిపెట్టిన మహాత్ముడి జీవితం ఆధారంగా ఆయన రూపొందించిన ఈ చిత్రం ఒక ‘ఎపిక్‌’గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందింది. అప్పటిదాకా ప్రపంచానికి పెద్దగా పరిచయంలేని బెన్‌ కింగ్‌స్లే అనే నటుణ్ణి గాంధీ పాత్రకు తీసుకుని, ఆయనకు ప్రపంచవ్యాప్త కీర్తిని ఆర్జించిపెట్టారు అటెన్‌బరో. 
 
22 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఆ చిత్రం 52.8 మిలియన్‌ డాలర్లను వసూలు చేయడమే కాకుండా హాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద 17 వారాల పాటు టాప్‌ 10లో నిలిచింది. 11 అస్కార్‌ నామినేషన్లు పొంది, ఎనిమిది అవార్డులను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. దర్శకునిగా ఆయన చివరి చిత్రం ‘క్లోజింగ్‌ ద రింగ్‌’ (2007). 
 
ఓ వైపు దర్శకుడిగా బిజీగా ఉంటూనే నటననూ కొనసాగించిన ఆయన స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ ప్రసిద్ధ చిత్రం ‘జురాసిక్‌ పార్క్‌’ (1993)లో డైనోసార్లను క్లోన్‌ చేసే శాస్త్రవేత్తగా అద్భుతంగా నటించారు. అయితే, ఈయన తన 91వ పుట్టినరోజు వేడుకలను జరుపుకునేందుకు మరో ఐదు రోజులు ఉండగా తుదిశ్వాస విడవడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu