Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూనె వాడకం తగ్గాలంటే ఏం చేయాలి..? ఒక పచ్చసొన=2 తెల్ల సొనలు..!

వంటల్లో నూనె వాడకం తగ్గాలంటే కాస్ట్ ఐరన్, నాన్‌‍స్టిక్ పాన్లను ఎంచుకోవాలి. నూనె వినియోగం చాలామటుకూ తగ్గుతుంది. అలాగే పదార్థాల తయారీకి ఆలివ్, కనోలా ఆయిల్స్ ఎంచుకోవడం ఎంతో మేలును ఇస్తాయి. ఇక వెన్నను, ఉప

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2016 (16:09 IST)
వంటల్లో నూనె వాడకం తగ్గాలంటే కాస్ట్ ఐరన్, నాన్‌‍స్టిక్ పాన్లను ఎంచుకోవాలి. నూనె వినియోగం చాలామటుకూ తగ్గుతుంది. అలాగే పదార్థాల తయారీకి ఆలివ్, కనోలా ఆయిల్స్ ఎంచుకోవడం ఎంతో మేలును ఇస్తాయి. ఇక వెన్నను, ఉప్పును వంటల్లో ఎంత తగ్గిస్తే అంత మంచిది.

తీపి పదార్థాల తయారీలో చాలాసార్లు వెన్న వేయాల్సి రావచ్చు. దాన్ని ఎక్కువగా వేయడం వల్ల శరీరానికి హాని చేసే శాచురేటెడ్‌ కొవ్వు అందుతుంది. అలాగని పూర్తిగా మానేస్తే పదార్థం అనుకున్న రుచిలో రాకపోవచ్చు. ఆ మోతాదును వీలైనంతవరకూ తగ్గించి ప్రత్యామ్నాయంగా ఆలివ్‌ లేదా కనోలా నూనెల్ని ఎంచుకోవచ్చు.
 
అలాగే ఉప్పు వినియోగం చాలామటుకూ తగ్గితే ఆరోగ్యానికి మంచిది. ఉప్పుకు ప్రత్యామ్నాయంగా నిమ్మరసం వేసుకోవచ్చు. తాజాగా ఉండే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు లాంటివి వాడొచ్చు. వీలైనంతవరకూ సోడియం శాతం తక్కువగా ఉండే పదార్థాలనే ఎంచుకోవాలి.

ఇంకా ఒక గుడ్డును తీసుకోవాలనుకునే వారు రెండు గుడ్ల తెల్లసొనల్ని తీసుకుంటే ఆరోగ్యాన్ని పొందవచ్చు. పచ్చసొనలో కెలోరీలు, కొవ్వు అధికంగా ఉండటంతో తెల్లసొనను ఎంచుకోవడం ఎంతో ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments