Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆముదం వాడితే గుండె జబ్బులు తొలగిపోతాయి...!

సంస్కృతంలో ఆముదాన్ని ఏరండ అని పిలుస్తారు. వృక్షాలు లేనిచోట ఆముదమే మహావృక్షం అని ఒక సామెత కూడా ఉంది. ఇది రెండు నుంచి ఆరు మీటర్ల మొక్కగా పెరుగుతుంది. ఆముదం వృక్షాన్ని ఇళ్ళలో పెంచుకోరుగానీ ఆముదం ఇళ్ళలో వ

Webdunia
బుధవారం, 2 నవంబరు 2016 (13:05 IST)
సంస్కృతంలో ఆముదాన్ని ఏరండ అని పిలుస్తారు. వృక్షాలు లేనిచోట ఆముదమే మహావృక్షం అని ఒక సామెత కూడా ఉంది. ఇది రెండు నుంచి ఆరు మీటర్ల మొక్కగా పెరుగుతుంది. ఆముదం వృక్షాన్ని ఇళ్ళలో పెంచుకోరుగానీ ఆముదం ఇళ్ళలో వాడుతూ ఉంటారు. ఆముదం విత్తనాల నుంచి లభించే నూనెనే ఆముదం అని పిలుస్తారు.
 
ఆముదం విత్తనాల నుంచి లభించే నూనెను విరేచనకారిగా వాడతారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు, చంటిపిల్లలకు ఆముదం పట్టించడం తెలుగువారికి కొత్త కాదు.
 
ఆముదాన్ని గుండెజబ్బులలో వాడతారు. ఆముదము గుండెలపైన వేసి మర్తనం చేయడం వేడి కాపడం పెట్టడం వల్ల ఛాతీ సంబంధమైన పలు సమస్యలు తొలగిపోతాయి.
 
ఆమ్లవాతములలో ఆముదాన్ని ఉపయోగిస్తారు. కీళ్ళనొప్పులలోనేగాక, కాళ్లుచేతులు విరిగినప్పుడు, బెణికినప్పుడు ఆముదాన్ని రాసి కట్టుకడతారరు. 
 
ఆముదపు ఆకులు శరీరంలో కలిగే వాపులను తగ్గిస్తాయి. ఆముదము వంటికి పట్టించి ఆ తరువాత శనగపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేస్తే శరీరం కాంతివంతమవుతుంది. ఆముదము విరేచక కారి ఇది. కడుపునొప్పి ఉన్న సందర్భంలో కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చంటిపిల్లలతో కడుపు ఉబ్బరం ఉన్నప్పుడు, కడుపునొప్పితో బాధపడుతున్నప్పుడు, నెలల పిల్లలతో విరేచనం సాఫీగా కాక బాధపడుతున్నప్పుడు తమలపాకులను తీసుకుని వాటికి ఆముదం బాగా ట్టించి వాటిని కుంపటిపైన వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు పసిపిల్లల బొడ్డుపైన కాపడం పెడితే సుఖ విరేచనం అవుతుంఇ. వారికి అప్పటిదాకా ఉన్న కడుపు ఉబ్బరం నొప్పి తగ్గిపోతాయి.
 
ఆముదము తలకు రాసుకుంటే జుట్టు నల్లగా, వత్తుగా, నిగ నిగ లాడుతూ ఉంటుందని అంటారు. అయితే ఆముదము జిడ్డుంగా ఉండే లక్షణం గలది. దీని వల్ల దుమ్ము తలపైన చేరి చుండ్రు వచ్చే అవకాశం కలుగుతుంది.
 
శీతాకాలంలో రోజూ కాళ్ళకూ, చేతులకూ ఆముదం రాసి తోముకుంటుంటే పాలుసులు మాదిరిగా చర్మం ఊడిపోవడం జరగదు. పెదవులపై వ్రాస్తే పెదాలు పగలకుండా ఉంటాయి. ఏదైనా పొరపాటున విషం మింగినపుడు వాంతి చేయించవలసి ఉంటుంది. వివిధ పద్థతులలో వాంతి చేయించినా ప్రేగులలో నిలిచి ఉండే విషపదార్థం పోవాలంటే ఐదు చెంచాల ఆముదాన్ని తాగితే విరేచనంలో విషపదార్థం తొలగిపోతుంది. చిన్న పిల్లలు ఒక చెంచా త్రాగినా సరిపోతుంది.
 
ఆముదము తీవ్రమైన విరేచనకారి కాబట్టి వీలైనంత తక్కువ పరిమాణంలోనూ వాడాలి. ఆముదాన్ని విరేచనకారిగా వాడేటప్పుడు దానిని బాగా కాగపెట్టి వాడాలి. అంతేకాకుండా ఆముదం తాగిన తర్వాత విరేచనాలు ఉదృతమవకుండా ఉండేందుకు గాను చింత పండు చారు తాగిస్తారు. 
 
ఆముదాన్ని, సున్నాన్ని సమపాళ్ళలో కలిపి పగలకుండా ఉన్న గడ్డలపైన లేక కురుపులైన వ్రాసినట్లయితే అవి త్వరగా పగిలిపోయి కురుపులు కూడా నయం అవుతాయి. గజ్జి వ్యాధిలో కూడా ఇది బాగా పనిచేస్తుంది. నరాల చురుకు, పోట్లు ఉన్నప్పుడు ఆముదము మర్దనా చేస్తే సరిపోతుంది. షికాటికా వ్యాధిలో కూడా ఆముదము కాస్త గోరువెచ్చగా చేసి మర్దనా చేస్తే చాలా బాగా పనిచేస్తుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రధాని మోదీ మీడియా సమావేశం ముగిసిన కొద్ది నిమిషాల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన

భీతావహం, ఫారెస్ట్ రేంజర్ తలను కొరికి చంపేసిన పెద్దపులి

Rain Alert: ఆంధ్రప్రదేశ్- తెలంగాణల్లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు

Andhra Pradesh: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. ఏపీ సర్కారు చర్యలు

భారత రక్షణ వ్యవస్థ... అలనాటి ఆస్ట్రేలియా బౌలర్లలా ఉంది : డీజీఎంవో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

తర్వాతి కథనం
Show comments