Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెయ్యికి పరుగులు తీస్తున్న "చంద్రముఖి"

వెయ్యికి పరుగులు తీస్తున్న
WD
క్రికెట్ అంటే దేశంలో యువతకు ఎంత ఆసక్తో అందరికీ తెలిసిందే. ఫోర్లతో సిక్సర్లతో ధనాధన్‌గా బంతిని బౌండరీలు దాటిస్తుంటే ఆ ఆనందమే వేరు. ఆ ధాటిని ఎదుర్కోవడానికి బుల్లితెరపై సీరియల్స్ ప్రభావం చూపాయనడంలో అతిశయోక్తి లేదు. అటువంటి సీరియల్‌లో సక్సెస్ సాధించింది చంద్రముఖి సీరియల్.

ఈటీవీలో రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే డైలీ సీరియల్‌కు అనూహ్య స్పందన లభిస్తోందని సీరియల్ దర్శకుడు యాట సత్యనారాయణ తెలియజేస్తున్నారు. ఇటీవలే 750 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ సీరియల్ టీఆర్పీ రేటింగ్‌లో నెంబర్ ఒన్ స్థానానికి చెక్కుచెదరకుండా నిలబెట్టుకోవడం విశేషం. అందుకే ఆ ఛానల్ అధినేతలు ఆ సీరియల్ వెయ్యి ఎపిసోడ్ల వరకూ కొనసాగించాలని నిర్ణయానికి వచ్చారు.

ఈ సీరియల్‌ను ఆర్కా మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై దేవినేని ప్రసాద్, యార్లగడ్డ శోభ నిర్మిస్తున్నారు. సినిమాను తలపించేటట్లుగా దర్శకుడి టేకింగ్‌తో పాటు పాటలు, ఫైట్స్ ఉన్న ఏకైక సీరియల్ ఇదేనని పేర్కొన్నారు.

దర్శకుడు యాట సత్యనారాయణ సీరియల్ విజయాన్ని గురించి వివరిస్తూ.. యశోధర తను ఎవరినైతే ప్రేమించిందో ఆ ప్రేమను పొందలేక జీవితాంతం నీలాంబరిగా గడిపేస్తుంది. కానీ అతనిపై కక్ష పెరుగుతుంటుంది. దాన్ని అతని బిడ్డపై తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. తనకు దక్కని ప్రేమ అతని కుమార్తెకు కూడా దక్కకూడదని చంద్రముఖి వేధిస్తుంది. ఈ నేపధ్యంలో సాగే కథాగమనమే ఈ సీరియల్. కథను వినగానే బడ్జెట్ పరిమితి లేకుండా నిర్మాతలు సహకరించబట్టే ఇన్ని ఎపిసోడ్లను చేయగలిగామని నిర్మాత అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ... కె. రాఘవేంద్రరావు శిష్యునిగా గత 12 ఏళ్లుగా పలు సినిమాలకు కోడైరెక్టర్‌గా పనిచేశాను. ఆ అనుభవంతో ఆ సీరియల్‌కు దర్శకత్వం వహించాను. ఈ సీరియల్‌కు ప్రేక్షకులు సినిమా రంగానికి చెందిన పలువురు ఉండటం విశేషమని తెలుపుతూ.. పద్మశ్రీ బ్రహ్మానందం ఓసారి ఫోన్ చేసి మా ఆవిడ 8 గంటలకు ఛానల్ మార్చనివ్వదు. ఏమిటీ ఆ సీరియల్ ప్రత్యేకత అని నేను చూశాను. ఆ టేకింగ్ చూసి ముగ్థుడ్నయ్యానని ప్రశంసించారని పేర్కొన్నారు.

అదేవిధంగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కూడా సీరియల్ చూసి మెచ్చుకోవడం ఆనందంగా ఉందంటూ... ఇంత సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సీరియల్‌లో ప్రధాన తారాగణం: పరిటాల నిరుపమ్, మంజు, ప్రీతి నిగమ్, చలపతి రాజు, అశోక్ రావు, జాకీ, శ్రీవాణి, దుర్గాప్రసాద్ తదితరులు, కెమేరా: దివాకర్, ప్రొడక్షన్: చింతపల్లి శేషయ్య చౌదరి, స్క్రీన్ ప్లే: గోపి, సంభాషణలు, దర్శకత్వం: యాట సత్యనారాయణ

Share this Story:

Follow Webdunia telugu