Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"లవ్ అజ్ కల్" సినిమా ట్రైలర్ మీ కోసం..

బాలీవుడ్ అగ్రహీరో సైఫ్ అలీ ఖాన్ తన సొంత బేనర్‌పై నిర్మిస్తోన్న తాజా చిత్రం "లవ్ అజ్ కల్". బాలీవుడ్‌లో 18 ఏళ్ల పాటు నటుడిగా తన హవాను కొనసాగించిన సైఫ్, లవ్ అజ్ కల్ చిత్రం ద్వారా నిర్మాతగా అవతారమెత్తారు. ఇందులో బాలీవుడ్ సెక్సీతార దీపికా పడుకునే హీరోయిన్‌గా నటిస్తోంది.

ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం జూలైలో విడుదలయ్యేందుకు సిద్ధమౌతోంది. లవ్ అజ్ కల్ ద్వారా నిర్మాతగా మారిన సైఫ్ అలీఖాన్ ఈ సినిమా గురించి చెబుతూ.. నిర్మాణ రంగంలో చాలా నేర్చుకున్నానని చెప్పారు. యాష్ రాజ్, ధర్మా ప్రొడక్షన్స్‌కు సంబంధించిన సినిమాల్లో నటించానని, దీంతో కొంతమేరకు నిర్మాణ రంగంలోని మెళకువలను కాస్త తెలుసుకున్నానని అన్నారు.

ఇంకా తన తండ్రి ఫర్హాన్ అక్తర్, కరణ్ జోహర్ వంటి స్నేహితులు ఎంతో సహకరించారని సైఫ్ అలీఖాన్ వెల్లడించారు. "లవ్ అజ్ కల్" కమర్షియల్ అంశాలతో రూపుదిద్దుకుంటోందని, దీపికా పడుకునే నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సైఫ్ అలీ ఖాన్ అన్నారు.

వైవిధ్య కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో తాను సిక్కు పాత్రను పోషిస్తున్నట్లు సైఫ్ వివరించారు. ఇప్పటికే దీపికా పడుకునే, సైఫ్ అలీఖాన్ కెమిస్ట్రీ అదిరిందని సినీ జనం అంటున్నారని ఆయన వెల్లడించారు.

త్వరలో తెరపైకి రానున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించి ఆనందించండి.

Share this Story:

Follow Webdunia telugu