Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"ద్రోణ" ఎలా ఉంటాడో..? ట్రైలర్లో చూడండి.

నితిన్, ప్రియమణి జంటగా నటించిన చిత్రం "ద్రోణ". సాయికృష్ణ ప్రొడక్షన్ పతాకంపై డీఎస్ రావు ఈ సినిమాను నిర్మించినఈ చిత్రానికి, ప్రముఖ దర్శకుడు రాజమౌళి శిష్యుడు కరుణకుమార్ ఈ సినిమా దర్శకత్వం వహించారు.

ఈ సినిమా గురించి నిర్మాత డి.ఎస్.రావు మాట్లాడుతూ.. 'సాగర తీరంలో సాగుతున్న తీవ్రవాదం, శత్రువులకు సాయపడే స్వార్థపరుల ఆలోచనలు, వాటిని ఎదిరించే కుర్రాడి కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రముఖ ఐటంగర్ల్ రాఖీసావంత్ తమ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నిర్మాత అన్నారు. "డాన్" ఫేం కెల్లీ జార్జ్ ఈ సినిమాలోనూ విలన్‌గా నటించారు.

ఈ సినిమాలో కీలక సన్నివేశాల చిత్రీకరణను రిస్క్ తీసుకొని చేశామని నిర్మాత తెలిపారు. నితిన్ ప్లాష్‌బ్యాక్‌గా వచ్చే ఈ ఎపిసోడ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగిస్తుందని నిర్మాత తెలిపారు.

ద్రోణలోని కొన్ని అద్భుత సన్నివేశాలను ట్రైలర్లో చూసి ఆనందించండి.

Share this Story:

Follow Webdunia telugu