Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగపతిబాబు 'సిద్ధం' ట్రైలర్

జగపతిబాబు 'సిద్ధం' ట్రైలర్
ఐపీఎస్ అధికారులైన పి. సీతారామాంజనేయులు, ముంబై పోలీసు అధికారి దయానాయక్‌ల జీవితంలో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రం "సిద్ధం". జగపతిబాబు, సింధుమీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్నారు.

"హోమం" చిత్రం తర్వాత జె.డి, జగపతిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం గురించి కిరణ్ కుమార్ చెబుతూ... టాస్క్‌ఫోర్స్ విభాగంలో పనిచేసే పోలీసు అధికారిగా జగపతిబాబు ఇందులో కన్పిస్తారన్నారు.

సంఘ విద్రోహశక్తుల్ని తుదిముట్టించడంలో ముందుండే వ్యక్తిగా జగపతిబాబు అద్భుతంగా నటించారని కొనియాడారు. ఇంజనీర్లు భవనాలు నిర్మిస్తారు.. డాక్టర్లు వైద్యం చేస్తారు.. నేను చంపుతాను -అనే పాత్ర జగపతిబాబుదని నిర్మాత తెలిపారు.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ ద్వారా వీక్షించండి.

Share this Story:

Follow Webdunia telugu