Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"కౌసల్య... సుప్రజా... రామ.." ట్రైలర్ మీ కోసం

శ్రీకాంత్, ఛార్మీ, గౌరి ముంజల్ హీరోహీరోయిన్లుగా నటించే చిత్రం "కౌసల్య సుప్రజా రామ..". సూర్యప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెన్సార్‌, షూటింగ్‌లతో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 9వ తేదీన తెరకెక్కనుందని నిర్మాత రామానాయుడు వెల్లడించారు.

సురేష్ ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమా గురించి నిర్మాత రామానాయుడు మాట్లాడుతూ... ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో స్థిరపడినప్పటికీ, ఎప్పుడైనా తన సొంతగూటికి చేరుకోవాల్సిందేనని, తమ కుటుంబం, సంస్కృతి, బంధువులకు ప్రాధాన్యమివ్వడం తప్పనిసరేననే అంశాలను ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు.

కుటుంబ కథా నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా హిట్ అవుతుందనే నమ్మకముందని, ఇప్పటికే విడుదలైన పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని నిర్మాత వెల్లడించారు.

శ్రీకాంత్, ఛార్మీ, గౌరీ ముంజల్ పాత్రలకు చక్కగా అమరారని ఆయన చెప్పారు. అద్భుతమైన కుటుంబ కథానేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్‌ ద్వారా వీక్షించండి.

Share this Story:

Follow Webdunia telugu