Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలాదిత్య "వేట" ట్రెయిలర్ మీకోసం..

బాలాదిత్య
, బుధవారం, 23 జులై 2008 (14:02 IST)
WD
బాలాదిత్య, స్వాతి ప్రియ హీరో హీరోయిన్లుగా బి.జి. వెంచర్స్ పతాకంపై తడకల రాజేష్ నిర్మిస్తున్న సినిమా 'వేట'. ప్రస్తుతం ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు పాము శ్రీను మాట్లాడుతూ.. రీరికార్డింగ్, ఎఫెక్ట్స్‌లు జరగకుండానే డబ్బింగ్‌లోనే చాలా బాగుందని ఆర్టిస్టులు ప్రశంసిస్తున్నారన్నారు.

సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించి చక్కని సందేశం చెబుతూ నేటి యువతను ఆకట్టుకునేలా ఉత్కంఠ కలిగించే అంశాలతో రూపొందించామన్నారు. నిర్మాత మాట్లాడుతూ, బాలాదిత్య, స్వాతిప్రియ హీరోహీరోయిన్ల పాత్రలకు చక్కగా కుదిరారని అన్నారు.

పల్లెటూరి నుంచి ఉద్యోగం కోసం వచ్చిన ఓ యువకుడు విలన్ల చేతిలోనుంచి తెలివిగా ఎలా తప్పించుకున్నాడనే కథా నేపథ్యంలో, సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగే ప్రేమ కథా చిత్రం "వేట" అని నిర్మాత పేర్కొన్నారు. శ్రీను, నర్సింగ్ యాదవ్, మల్లాది రాఘవ, జెన్నీ తదితరులు నటిస్తున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రెయిలర్ రూపంలో వీక్షించండి...

Share this Story:

Follow Webdunia telugu