Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చార్మి 'ప్రతిఘటన' ఏపాటిది...? చిరుకు చురకలు కూడా....

చార్మి 'ప్రతిఘటన' ఏపాటిది...? చిరుకు చురకలు కూడా....
, శనివారం, 19 ఏప్రియల్ 2014 (18:15 IST)
WD
చార్మి, రేష్మ నటించిన ప్రతిఘటన విడుదలయింది. ఈ చిత్రం సమీక్ష అలా పెడితే... రాష్ట్రంలోనూ, దేశంలోనూ మహిళలపై అత్యాచాచాలు జరగడం మామూలైపోయింది. ఢిల్లీ కేంద్రంలోనే ఓ మహిళలను పైశాచికంగా రేప్‌ చేసి చంపిన ఉదంతం ఢిల్లీ పీఠాన్నే కుదిపేసింది. చట్టాలు న్యాయం చేయడానికి తాత్సారమాడుతున్నప్పుడు సినిమా ద్వారా ఇలా చేసి చూపించవచ్చని ఆర్‌.నారాయణమూర్తి కూడా తన దైన శైలిలో సినిమా తీసేశాడు. నేరస్తుల్ని తుపాకులతో కాల్చి పారేశాడు సినిమాలో. మళ్ళీ అదే పాయింట్‌తో తమ్మారెడ్డి భరద్వాజ చేయడం సాహసమే. అయితే ఆ చిత్రం తీసి ఆటుపోట్లతో ఎలక్షన్ల టైంలో విడుదలయింది. చార్మి చేసిన 'ప్రతిఘటన' సినిమాకు ఎంత వరకు ఎఫెక్ట్‌ అయిందో చూడ్దాం.

కథగా చెప్పాలంటే....
చలం (అతుల్‌కులకర్ణి) పేరుపొందిన ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు. సిన్సియర్‌గా పేరు తెచ్చుకుంటాడు. సిటీలో బాలరాజు (రఘుబాబు) 'ఉద్దరిస్తా' అనే పార్టీ నాయకుడు. ఎప్పటికైనా సి.ఎం. కావాలని ఆశపడుతుంటాడు. కానీ రూలింగ్‌ పార్టీతో మంత్రి పదవి కోసం తన పార్టీని కలిపేస్తాడు(అచ్చు చిరంజీవి చేసినట్లుగా ఉంటుంది). మరోవైపు నిశ్చల(చార్మి) టీవీ ఛానల్‌ రిపోర్టర్‌.

సోషల్‌ రెస్పాన్స్‌తో ఓ రేప్‌ కేసును పరిశోధిస్తుంది. అందులో భాగంగా బాధితుల స్నేహితులతో కలిసి కేసును బయటపెడుతుంది. అయితే లోకల్‌ ఎస్‌ఐ పోసాని ఈ కేసును మరుగునపెట్టే ప్రయత్నం చేస్తాడు. నిశ్చల రాకతో ఇది రాష్ట్రమంతా వ్యాప్తి చెంది పెద్ద ఇష్యూగా మారిపోతుంది. ఆ తర్వాత ఈ కేసు ఏమయింది. చలం ఏం చేయగలిగాడు. అసలు ఇందులో ఎవరెరు ఇన్‌వాల్వ్‌ అయ్యారు. పరిష్కారం ఏం చెప్పారు? అనేది కథ.

విశ్లేషణ
నిర్భయ కేసు తర్వాత తీసిన ఈ చిత్ర కథను దర్శకనిర్మాత తమ్మారెడ్డి ఒరిస్సాలో జరిగిన కథగా చెబుతాడు. రేప్‌ కేసులో పొలిటీషియన్‌ ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఎలా ఉంటుంది. వారే లేకపోతే సమాజంలో ఇటువంటివి జరుగుతాయా? అనే కాన్సెప్ట్‌ను టచ్‌ చేశాడు. ప్రతి సన్నివేశంలోనూ క్రిటిక్‌గా చూపిస్తూ సెటైరిక్‌గా మార్చేశాడు. నటనాపరంగా చార్మి ఎపిసోడ్‌ బాగానే ఉంది. తన ఎనర్జీని ఉపయోగించింది. రిపోర్టర్‌గా ఎలా బిహేవ్‌ చేయాలో చూపించింది. అయితే ఆమె వాయిస్‌ ఒరిజినల్‌గా ఉండటంతో ఎమోషన్‌ అంత ఇదిగా పడలేకపోయింది. ఇప్పటివరకు ఆమె వాయిస్‌ అరువు కావడంతో కాస్త ఇంట్రెస్ట్‌గా ఉండేది. రఘుబాబు, ఉత్తేజ్‌ వంటి పాత్రలతో సెటైరిక్‌ కామెడీ పండింది.

చాలా కాలం తర్వాత ఎస్‌.గోపాల్‌రెడ్డి తమ్మారెడ్డి చిత్రానికి పని చేయడం జరిగింది. లక్ష్మీభూపాల్‌ సంభాషణలు ట్రెండ్‌కు తగినట్లుగా రాశాడు. సంగీతపరంగా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ చెప్పకోవాల్సింది మినహా ఎక్కడా పాటలకు అవకాశంలేదు. తమ్మారెడ్డి చాలాకాలం తర్వాత దర్శకునిగా తీసిన తీరు కొంచెం వీక్‌గా అనిపిస్తుంది. రేప్‌కు గురైన మహిళ ఆమె తరఫున సాక్ష్యం చెప్పడానికి వచ్చిన మరో మహిళ, వీరిని అడ్డుకునే విలన్లు.. అనే కథ.. చాలాకాలంగా స్క్రీన్‌పై చూసిందే. దాన్ని ఇంకా పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్‌ చేసి తీస్తే ఆకట్టుకునేది. దానికితోడు సపోర్టింగ్‌ నటీనటులు అంతా కొత్తమొహాలు కావడంతో ఫీల్‌ కలగలేదు.

సున్నితమైన అంశాన్ని తీసుకున్నప్పుడు ఇంకాస్త సీరియస్‌గా చిత్రాన్ని తీస్తే బాగుండేది. అందుకే ఇది సోసో.. సినిమాగానే మిగిలిపోయింది. విజయశాంతి నటించిన 'ప్రతిఘటన' చిత్రం ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా తీసినా అందులోనూ వంచించిన మహిళగా నటించి... ప్రజానాయకుడవుతున్న వాడ్ని చంపేస్తుంది. సినిమాలో అదే కీలకం. ఈ చిత్రాన్ని ఆ చిత్రం తరహాలోనైనా కాస్త మార్పు చేసి తీసి ఉన్నట్లయితే సినిమాటిక్‌గానూ ఉండేది. మరి చార్మి ప్రతిఘటన ఎంతమేరకు ఎక్కుతుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu