Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'జయం' తేజకు కమల్ హాసన్ ఛాన్స్ ఇచ్చాడా...?

'జయం' తేజకు కమల్ హాసన్ ఛాన్స్ ఇచ్చాడా...?
, బుధవారం, 23 ఏప్రియల్ 2014 (13:23 IST)
WD
దర్శకుడు తేజ ఎప్పటికప్పుడు సినిమాలు ఫెయిల్‌ అయినా కాస్త విరామం ఇచ్చాక ఏదో కొత్త న్యూస్‌లో ఉంటాడు. అంతా కొత్తవారితో సినిమా చేస్తాను. సీనియర్స్‌తో చేయడం నా పాలసీ కాదు. వారిని కంట్రోల్‌ చేయడం కష్టమని స్టేట్‌మెంట్లు ఇచ్చిన తేజ మనస్సు మార్చుకున్నట్లుంది.

నితిన్‌, మహేష్‌ బాబులతో సినిమా తీసిన ఆయన ఇప్పుడు కమల్‌ హాసన్‌తో సినిమా చేయనున్నాడనే వార్తలు విన్పిస్తున్నాయి. ఇటీవలే చెన్నై వెళ్ళి కమల్‌ను కలవడం ఆయనతో చర్చలు జరిగినట్లు ఫిలింనగర్‌ కథనాలు.

తమిళంలో నిర్మించి తెలుగులో డబ్‌ చేస్తూ రెండుభాషల చిత్రంగా విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నట్లు విన్పిస్తున్నాయి. కొద్దిరోజుల్లో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu