Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అతడు చేస్తానని సాగదీస్తున్నాడట.... నటి సోనా ఫైర్

అతడు చేస్తానని సాగదీస్తున్నాడట.... నటి సోనా ఫైర్
, మంగళవారం, 22 ఏప్రియల్ 2014 (21:41 IST)
FILE
ఇటీవలే ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం తనయుడు చరణ్‌ తనను వేధించారని నటి సోనా ఆరోపించింది. చరణ్‌ నటుడే కాకుండా దర్శకుడు కూడా. ఇవన్నీ ఇండస్ట్రీలో మామూలే అయినా.. పేరు పొందిన వ్యక్తి కొడుకుపై ఇలా ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనమైంది. ఎస్‌పి బాలు దీనిని తగిన విధంగా పరిష్కరించారు.

అయితే ఇప్పుడు సోనా మళ్ళీ వెంకట్‌ ప్రభు అనే తమిళ దర్శకుడపై విమర్శ చేస్తుంది. అవసరమైతే ఆయనపై కేసు పెడతానని అంటోంది. విషయం ఏమంటే... ఇటీవలే ఆమెతో ఓ సినిమా చేస్తానని వెంకట్‌ ప్రభు అడ్వాన్స్‌ తీసుకున్నాడట.

సినిమా గురించి ప్రస్తుతం మాట్లాడకుండా దాట వేయడంతో మూడు నెలలుగా విసుగు చెందానని అంటోంది. దీనికి తమిళ మీడియా పెద్ద ప్రచారం చేస్తుంది. ఒకప్పుడు ఇద్దరికీ మంచి సాన్నిహిత్యం ఉందని వార్తలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం పైసా దగ్గరే గొడవ వచ్చింది. ముందుముందు ఏం జరుగుతుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu