హిట్లు లేక రాజీపడిన ఇలియానా?
, బుధవారం, 7 సెప్టెంబరు 2011 (11:12 IST)
ఒకప్పుడు తెలుగులో అగ్రకథానాయికగా చెలామణి అయిన హీరోయిన ఇలియానా. ఈ గోవా ముద్దుగుమ్మ తాజాగా నటించిన చిత్రాలైన "శక్తి", "నేను నా రాక్షసి" చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో ఆమె కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో నిన్నమొన్నటి వరకు పారితోషకం విషయంలో ఏమాత్రం బెట్టుసడలించిన ఈ సన్ననడుం చిన్నది.. ఇపుడు మెట్టుదిగి సర్దుకుపోవడానికి సిద్ధమైపోయింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించే చిత్రానికి ఇలియానా పారితోషికం విషయంలో ఓ పూర్తిగా రాజీపడిందట. రెమ్యునరేషన్ కంటే పట్టువిడుపులే కీలమని పేర్కొంటూ వచ్చిన ఆఫర్‌పై సంతకం చేసేందుకు సై అంటోందట. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "త్రీ ఇడియట్స్" రీమేక్‌గా తమిళంలో రూపొందుతున్న "నన్‌బన్" చిత్రంలో ఇలియానా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం త్రీ రాస్కెల్స్‌గా తెలుగులోకి అనువాదమవుతోంది. దీంతో ఇటీవల కాలంలో ఉత్సాహంగా కనిపిస్తున్న ఈ భామ రాబోయే చిత్రాలు తెలుగులో తనకు పూర్వవైభవాన్ని తెస్తాయనే విశ్వాసంతో వుంది . ఎలాగైనా మంచి హిట్‌కొట్టి రేసులో దూసుకుపోవాలని ఆరాటపడిపోతోంది.