Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామ్‌చరణ్‌ 'ఆరెంజ్‌'లో చిందేసిన సీనియర్ నటి రంభ

రామ్‌చరణ్‌ 'ఆరెంజ్‌'లో చిందేసిన సీనియర్ నటి రంభ
WD
WD
సీనియర్ నటి అందాల రంభ యువ హీరో, జూనియర్ మెగాస్టార్ రామ్ చరణ్‌‌తో కలిసి డ్యాన్స్ చేసిందట. చెర్రీ కొత్త చిత్రం 'ఆరెంజ్‌'లో రంభ ఒక ఐటమ్ సాంగ్‌లో తన అందాలను ఆరబోసినట్టు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ వర్గాల సమచారం.

గతంలో మెగాస్టార్ చిరంజీవి సరసన 'బావగారూ బాగున్నారా' చిత్రంలో హీరోయిన్‌గా ఈ ముద్దుగుమ్మ నటించింది. ఆ తర్వాత చిరంజీవి అల్లుడు అల్లు అర్జున్ నటించిన 'దేశముదురు' చిత్రంలో కూడా ఐటమ్ సాంగ్‌లో తళుక్కుమంది.

ఇపుడు 'ఆరెంజ్' చిత్రంలో ఇదే తరహా సాంగ్‌లో చిందేసినట్టు సమాచారం. చిరంజీవి సోదరుడు కె.నాగేంద్రబాబు అంజనా ప్రొడక్షన్ బేనర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకుడు. ఈ చిత్రంలో ఒక క్లబ్ డ్యాన్స్ పాట కూడా ఉంది. ఈ పాటలో క్లబ్ డ్యాన్సర్‌గా రంభ రామ్ చరణ్‌తో కలిసి నాట్యం చేసిందట.

సో.. తండ్రీ తనయులతో కలసి నటించినచ హీరోయిన్ల జాబితాలో రంభ కూడా చేరిపోయిందన్నమాట. ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. రంభ వివాహం చేసుకున్న తర్వాత సినిమాల్లో నటించడం ఇదే తొలి తొలిసారి కావడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu