Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజశేఖర్ హీరోగా 'గడ్డం గ్యాంగ్' ప్రారంభం!

రాజశేఖర్ హీరోగా 'గడ్డం గ్యాంగ్' ప్రారంభం!
, శుక్రవారం, 25 ఏప్రియల్ 2014 (11:06 IST)
FILE
డాక్టర్ రాజశేఖర్ కొత్త చిత్రం 'గడ్డం గ్యాంగ్' హైదరాబాద్‌లో ప్రారంభమయింది. తమిళంలో మంచి విజయం సాధించిన 'సూదుకవ్వుమ్' సినిమాకి రీమేక్‌గా దీన్ని రూపొందించనున్నారు. 'జర్నీ' ఫేం శరవణన్ వద్ద పనిచేసిన పి. సంతోష్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ గురువారం హైదరాబాదులో ప్రారంభమయింది.

ఈ సినిమాలో 'పంజా' ఫేం అంజలి లావానియా రాజశేఖర్ సరసన నటించనుంది. సినిమా టైటిల్‌కి తగ్గట్టుగానే రాజశేఖర్ గడ్డం కూడా బాగానే పెంచాడు. శివాణి శివాత్మక మూవీస్ బ్యానర్‌పై జీవితా రాజశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

Share this Story:

Follow Webdunia telugu