Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రామ్ చరణ్‌- బోయపాటి సినిమా.. చరణ్ "ఓ నిప్పుకణిక''!

రామ్ చరణ్‌- బోయపాటి సినిమా.. చరణ్
, శుక్రవారం, 25 ఏప్రియల్ 2014 (10:08 IST)
FILE
మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్‌తో సినిమా చేయడం కన్‌ఫామ్‌ అయిందని దర్శకుడు బోయపాటి శ్రీను తెలియజేస్తున్నాడు. ఈనెల 25న దర్శకుడు బోయపాటి శ్రీను పుట్టినరోజు, ఈ సందర్భంగా ఆయన తన కొత్త ప్రాజెక్ట్‌ల గురించి చెబుతూ, రామ్‌చరణ్‌ను నిన్ననే కలిసి మొత్తం కథను విన్పించాను. టోటల్‌గా నచ్చింది. జూన్‌లో సినిమాను ప్రారంభిస్తామని చెప్పారు.

ఇందులో చరణ్‌ ఓ నిప్పుకణికలా కన్పిస్తాడు. నవతరం ఆయన్ను ఎలా చూడాలనుకుంటుందో అదే తరహాలో చూపించబోతున్నాను. ప్రేమ, యాక్షన్‌, కుటుంబ సంబంధాలు అన్నీ ఇందులో వుంటాయని చెప్పారు. ఈ చిత్రాన్ని కె.ఎల్‌. నారాయణ నిర్మిస్తున్నారు. హీరోయిన్‌ కోసం వేట మొదలైంది. త్వరలో ఆ వివరాలు తెలియజేస్తానన్నారు.

Share this Story:

Follow Webdunia telugu