Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సింగర్ చిన్మయి పెళ్లి: గిఫ్ట్‌లువద్దు డబ్బు పంపించండి!

సింగర్ చిన్మయి పెళ్లి: గిఫ్ట్‌లువద్దు డబ్బు పంపించండి!
, బుధవారం, 23 ఏప్రియల్ 2014 (15:44 IST)
FILE
ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి పెళ్లి చేసుకోనుంది. నటుడు రాహుల్ రవీంద్రన్‌తో మే6న చెన్నైలో ఓ హోటల్‌లో ఆమె వివాహం జరగనుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తనదైన ముద్రవేసిన చిన్మయి.. 'అందాల రాక్షసి', పెళ్లి పుస్తకం, నేనేం చిన్నపిల్లనా వంటి సినిమాల్లో హీరోగా నటించిన రాహుల్ రవీంద్రన్ ఒక్కటవనున్నారు.

తమ పెళ్లిలో కానుకలు స్వీకరించబోమని, వాటికి బదులుగా కానుకలు వెచ్చించే సొమ్మును లడఖ్‍కు చెందిన 17,000 ఫీట్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకు అందజేయాల్సిందిగా ఈ జంట కోరుతోంది. అందాల రాక్షసి సినిమా డబ్బింగ్ సందర్భంగా ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇరుకుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu