Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శృతిహాసన్ షాకింగ్ నిర్ణయం... ముసలమ్మ పాత్రలో!

శృతిహాసన్ షాకింగ్ నిర్ణయం... ముసలమ్మ పాత్రలో!
, మంగళవారం, 22 ఏప్రియల్ 2014 (12:02 IST)
FILE
తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడిపేస్తోన్న శృతిహాసన్ ఇపుడు తండ్రికి తగ్గ కూతురు అనిపించుకోవాలని ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఏ హీరోయిన్ చేయనటువంటి సాహసం చేయడానికి ఈ ముద్దుగుమ్మ సిద్ధమయింది.

మరగుజ్జుగా, ముసలివాడిగా, ఒకే సినిమాలో పది పాత్రలు పోషించడం ఇలా కమల్ ఒక్కరికే చెల్లింది. ప్రస్తుతం కమల్ హాసన్ కూమార్తె శృతి హాసన్ కూడా తండ్రి బాటలో నడుస్తోంది. తిగ్మంషు దులియా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న "యారా" అనే హిందీ సినిమాలో శృతి హాసన్ వృద్దురాలి పాత్రలో నటించడానికి అంగీకరించింది.

తుపాకీ సినిమా విలన్ 'విద్యుత్ జమాల్', 'అమిత్ సాద్' హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా కధ రెండు తరాలకు చెందినది. ఈ సినిమాలో హీరోయిన్'గా శృతి హాసన్ నటిస్తుంది. సీనియర్ నటిని ఎవరినైనా ఫ్లాష్ బ్యాక్లో వృద్దురాలి పాత్రలో నటింప చేయడానికి దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తున్న సమయంలో ఆ పాత్రను కూడా నేనే చేస్తాను అని బంపర్ ఆఫర్ ఇచ్చింది శృతి.

Share this Story:

Follow Webdunia telugu