Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్రహ్మానందానికి సన్మానం... నటనకు 30 ఏళ్లు....

బ్రహ్మానందానికి సన్మానం... నటనకు 30 ఏళ్లు....
, శనివారం, 19 ఏప్రియల్ 2014 (21:37 IST)
WD
నటుడు బ్రహ్మానందం చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి 30 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆయన్ను సన్మానించారు. అంజలి ప్రధానపాత్ర పోషిస్తున్న 'గీతాంజలి' చిత్రం ఫస్ట్‌లుక్‌ ఆవిష్కరణ సందర్భంగా బ్రహ్మానందానికి సన్మానం జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ... గుండె ఆనందంగా ఉన్నప్పుడు మాటలు రావనే సామెత ఒకటి ఉంది. అది నిజం అని ఈ రోజు అనిపిస్తుంది. 987 సినిమాలు చేసి ప్రేక్షకుల్ని అలరించానంటే అది నా గొప్పతనంకాదు.

జంధ్యాలగారి నుండి నేటివరకు నాకు అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తున్న దర్శక నిర్మాతలదే ఆ గొప్పతనం. నా సినిమాలు చూసి కోట్లమంది ప్రేక్షకులు నవ్వుకున్నారు. ఆ నవ్వులే నాకు దీవెనలు. చివరి శ్వాస వరకు ప్రేక్షకుల్ని నవ్విస్తూనే ఉంటాను అన్నారు. గీతాంజలి చిత్రం గురించి చెబుతూ... హారర్‌ నేపథ్యంలో చక్కగా కుదిరిన చిత్రమిది. శ్రీనివాసరెడ్డి లీడ్‌రోల్‌ చేస్తున్నారు. సినిమా ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది అన్నారు. రావు రమేష్‌ మాట్లాడుతూ... తొలిసారి నాన్నగారి ఫొటో కాంబినేషన్‌లో చేయడం ఆనందంగా ఉందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu