Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ అశ్లీల చిత్రాలు నావి కావు: హీరోయిన్ సంజన!

ఆ అశ్లీల చిత్రాలు నావి కావు: హీరోయిన్ సంజన!
, శనివారం, 19 ఏప్రియల్ 2014 (15:04 IST)
FILE
కన్నడ హీరోయిన్ సంజనకు 'అగ్రజ' సినిమా చిక్కులు తెచ్చిపెట్టింది. ''బుజ్జిగాడు'' సినిమాతో తెలుగువారికి సుపరిచితురాలైన సంజన తాజాగా శాండల్‌వుడ్ హీరో జగ్గేష్‌తో 'అగ్రజ' అనే కన్నడ సినిమాలో నటించింది. శుక్రవారం ఈ సినిమా విడుదలైంది. అయితే రిలీజైన మొదిటిరోజే ఈ సినిమా వివాదం సృష్టించింది.

ఈ సినిమాలోని కొన్ని అశ్లీల సన్నివేశాల్లో ఉన్నది తానే అన్నట్లుగా చిత్రీకరించారని, అయితే ఆ సన్నివేశాల్లో ఉన్నది తాను కాదని సంజన ఆరోపిస్తోంది. వేరొకరితో ఆ సన్నివేశాలు చిత్రీకరించి, అందులో ఉన్నది తానేనన్నట్లుగా చూపించడం ఎంతగానో బాధించిందంటూ తన ట్విట్టర్ అకౌంట్‌లో సంజన పేర్కొన్నారు.

అయితే సంజన చేస్తోన్న ఆరోపణలపై ఆ చిత్రదర్శకుడు శ్రీనందన్ స్పందిస్తూ... ఇందులో సంజనపై చిత్రించనున్న దృశ్యాలు తదితర అన్ని వివరాలు ముందే ఆమెకు వివరించామని, ఇందులో మేం ఎలాంటి మోసానికి పాల్పడలేదని ఆయన పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu