Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హన్సికను అల్లరిచేసిన ఆకతాయిలు... ఎక్కడెక్కడో టచ్ చేశారు!

హన్సికను అల్లరిచేసిన ఆకతాయిలు... ఎక్కడెక్కడో టచ్ చేశారు!
, శనివారం, 19 ఏప్రియల్ 2014 (12:27 IST)
FILE
కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోన్న అందాల భామ హన్సికకు చేదుఅనుభవం ఎదురైంది. తాజాగా ఓ షూటింగ్ కోసం గోవావెళ్లిన ఈ బ్యూటీపై కొందరు ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించారు. తనపై ఇలా ఒక్కసారిగా ఆకతాయిలు దూసుకురావడంతో హన్సిక ఒక్కసారిగా షాక్‌కు గురైంది.

క్రేజీ హీరో సిద్ధార్థ్‌తో హన్సిక ఓ తమిళ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఓ పాట చిత్రీకరణలో భాగంగా గోవా బీచ్‌లో శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో షూటింగ్ నిర్వహించారు. షూటింగ్ గ్యాప్‌లో కొంతమంది ఆకతాయిలు అభిమానులమని చెప్పి హన్సిక ఆటోగ్రాఫ్ కోసం ఆమెవద్దకు వెళ్లారు. ఆమె ఆటోగ్రాఫ్ ఇస్తుండగా ఆమెను ఎక్కడెక్కడో టచ్ చేయడానికి వారు ప్రయత్నించారు. దీంతో షాక్‌కు గురైన హన్సిక వారిని తోసేసింది.

ఈ విషయాన్ని గమనించిన చిత్ర యూనిట్ సభ్యులు ఆకతాయిలను తరిమికొట్టేందుకు ప్రయత్నించగా వారు యూనిట్ సభ్యులతో గొడవ పడ్డారు. జరిగిన విషయంపై యూనిట్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu