Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇసుక తుఫాన్‌లో చిక్కుకున్న కోహ్లీ ప్రియురాలు అనుష్క!

ఇసుక తుఫాన్‌లో చిక్కుకున్న కోహ్లీ ప్రియురాలు అనుష్క!
, శనివారం, 19 ఏప్రియల్ 2014 (10:33 IST)
FILE
రాజస్థాన్‌లో అనూహ్య రీతిలో ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. వాతావరణంలో అనూహ్య మార్పుల వల్ల దుమ్ము, ధూళితో ఇసుక తుఫాన్ విరుచుకుపడింది. ఈ సంఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. అయితే ఇసుక తుఫాన్‌లో బాలీవుడ్ హీరోయిన్, క్రికెటర్ కోహ్లీ ప్రియురాలు అనుష్క శర్మ చిక్కుకున్నారు.

'ఎన్ హెచ్ 10' సినిమా షూటింగ్ కోసం ఆ చిత్ర బృందం ఇక్కడకు వచ్చింది. ఇసుక తుఫాన్ కారణంగా రాజస్థాన్‌లో జరుగుతున్న 'ఎన్ హెచ్ 10' చిత్ర షూటింగ్‌కు అంతరాయం కలిగింది. నాతోపాటు 'ఎన్ హెచ్ 10' చిత్ర షూటింగ్ యూనిట్ అంతా ఇసుక తుఫాన్‌లో నిన్న ఇరుక్కున్నాం. అయితే అందరం క్షేమంగా బయటపడ్డాం అని అనుష్క శర్మ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu