Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'పట్టపగలు' టీనేజ్‌ దెయ్యంతో వర్మ...

'పట్టపగలు' టీనేజ్‌ దెయ్యంతో వర్మ...
, బుధవారం, 16 ఏప్రియల్ 2014 (20:12 IST)
WD
చిన్న పిల్లలకు దెయ్యాలు పట్టించి దాన్ని సాల్వ్‌ చేసే కాన్సెప్ట్‌తో చిత్రాలు తీసిన రాంగోపాల్‌ వర్మ ఈసారి యవ్వనంలో ఉన్న అమ్మాయికి దెయ్యం పడితే ఎలా ఉంటుందనేది 'పట్టపగలు'లో చూపించబోతున్నాడు. పూంక్‌, బూత్‌-2 పిల్లలకు దెయ్యం పట్టే చిత్రాలే. అయితే పట్టపగలులో రాజశేఖర్‌ కుమార్తెగా నటించిన స్వాతీ దీక్షిత్‌ చేసిన దెయ్యం సీన్స్‌ ఇటీవలే ట్రైలర్స్‌గా విడుదలయ్యాయి.

యూత్‌ మనసును దోచుకునే స్వాతి దీక్షిత్‌ ఈసారి దెయ్యంపట్టిన అమ్మాయిగా నటించడం ఎంతవరకు ఉపయోగపడుతుందనే ప్రశ్నకు వర్మ మాత్రం చాలా బాగుంటుందని ట్వీట్ చేశాడు. నేను అనుకున్న దానికన్నా ఎక్కువగా రెస్పాన్స్‌ వస్తుందనంటున్నాడు.

మోహన్‌ బాబుతో 'రౌడీ'ని చూపి సక్సెస్‌ చేసినట్లు ఈ సినిమా సక్సెస్‌ అవుతుందనే ధీమాతో ఉన్నాడు. చూసేవారు ఉంటే... సక్సెస్‌లు ఎలాగూ అవుతాయిగా.

Share this Story:

Follow Webdunia telugu