Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'లెజెండ్' బాలయ్య రూ. 50 కోట్లు కొట్టేశాడు... ఫ్యాన్స్ పండగ...

'లెజెండ్' బాలయ్య రూ. 50 కోట్లు కొట్టేశాడు... ఫ్యాన్స్ పండగ...
, బుధవారం, 16 ఏప్రియల్ 2014 (15:48 IST)
WD
నందమూరి వంశంలో ఇప్పటివరకు ఏ ఒక్క కథానాయకుడు కూడా '50 కోట్ల క్లబ్‌'లో స్థానం సంపాదించలేకపోయారు. ఈ రేర్‌ ఫీట్‌ను తన తాజా చిత్రం 'లెజెండ్‌'తో సునాయాసంగా చేయగలిగారు నటసింహం నందమూరి బాలకృష్ణ. మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'లెజెండ్‌' నందమూరి అభిమానులతో పాటు యావత్‌ సినీ అభిమానుల్ని విశేషంగా ఆట్టుకొని ఘన విజయం సొంతం చేసుకొంది.

తొలివారంలోనే 33 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి రికార్డ్‌ సృష్టించింది. 'ఈ సినిమా 50 కోట్లు కలెక్షన్లు రాబట్టడం ఖాయం' అన్న సినీ విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ 50 కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించిన 'లెజెండ్‌' 2014 సంవత్సరంలో సరైన హిట్లు లేక విలవిల్లాడుతున్న తెలుగు చిత్ర పరిశ్రమకు ఊపిరిపోసింది.

నందమూరి నటసింహం బాలకృష్ణ అభినయం, ఆయన పలికిన సంభాషణలు, బోయపాటి శ్రీను దర్శకత్వ ప్రతిభ, వారాహి చలనచిత్రం మరియు 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌ నిర్మాణ విలువలు, దేవిశ్రీప్రసాద్‌ సంగీతం ఈ చిత్రం సాధిస్తున్న సంచలన విజయంలో కీలకపాత్ర పోషించాయి.

ముఖ్యంగా దర్శకుడు బోయపాటి శ్రీను తన 5వ చిత్రంతోనే '50 కోట్ల క్లబ్‌'లో స్థానం సంపాదించుకోవడం విశేషం. త్వరలోనే 'లెజెండ్‌' చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొని ఉన్న రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

'లెజెండ్‌' విజయానందంలో ఉన్న నందమూరి అభిమానులకు బాలకృష్ణ రాజకీయరంగ ప్రవేశం నూతనోత్సాహాన్నిచ్చింది. ఆయన ఇవాళ (16/04/2014) హిందూపూర్‌లో నామినేషన్‌ దాఖలు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu