Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ ఫ్లోర్‌కి అమృతం అని పేరు పెట్టాలనుకున్నాం - నాగార్జున

ఈ ఫ్లోర్‌కి అమృతం అని పేరు పెట్టాలనుకున్నాం - నాగార్జున
, మంగళవారం, 15 ఏప్రియల్ 2014 (20:25 IST)
WD
జస్ట్ ఎల్లో మీడియా ఫ్రై.లిమిటెడ్ పతాకంపై గంగరాజు గుణ్ణం దర్శకత్వంలో ఊర్మిళ గుణ్ణం నిర్మించిన వెరైటీ ఎంటర్ టైనర్ 'చందమామలో అమృతం'. శ్రీ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోలో ఏప్రిల్ 13న వైభవంగా జరిగింది. వేల్ రికార్డ్స్ ద్వారా విడుదలైన ఈ ఆడియో కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా అక్కినేని నాగార్జున, దర్శకులు రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, రాజమౌళి, సంగీత దర్శకులు కీరవాణి, వెంకట్ అక్కినేని, చత్రపతి ప్రసాద్, జెమిని కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఆడియో సీడీలను దర్శకేంద్రులు రాఘవేంద్రరావు స్వీకరించి, నాగార్జునకు అందజేసారు. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ - ''అప్పుడప్పుడు యు ట్యూబ్లో అమృతం సీరియల్ ఎపిసోడ్స్ చూస్తుంటాను. 313 ఎపిసోడ్స్ అనుకుంటాను. అత్త, కోడళ్ల అనుబంధాలతో సీరియల్స్ చేయడం ఈజీ. కానీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తూ, ఇన్ని ఎపిసోడ్స్‌తో సీరియల్ చేయడం అంత ఈజీ కాదు. ఈ సీరియల్ వల్ల 'మా' టివి టిఆర్పీ రేటింగ్ పెరిగింది. ఇందుకు గంగరాజుగారికి కృతజ్ఞతలు.

ఈ చిత్రం షూటింగ్‌ని ఇప్పుడు ఆడియో వేడుక జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోలోని ఈ సెట్ లో రెండు నెలలు షూటింగ్ చేసారు. దాంతో ఈ ఫ్లోర్ కి అమృతం అని పేరు పెడదామని మాట్లాడుకున్నాం. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. టీమ్ కి ఆల్ ది బెస్ట్'' అని తెలిపారు.

దర్శకులు గంగరాజు గుణ్ణం మాట్లాడుతూ - ''నేను అమృతం సీరియల్ ఆరంభించినప్పుడు రాఘవేంద్రరావు గారిని పిలిచాను. ఆయన నీకేమైనా మతి పోయిందా. ఈ రోజు అమావాస్య అన్నారు. అమావాస్య రోజున ఆరంభించాం. ఎందుకు ఆరంభించామనే విషయం ఈ చందమామ సినిమా చూస్తే అర్ధమవుతుంది'' అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో వేల్ రికార్డ్స్ అధినేత శ్రీవల్లి, రమారాజమౌళి, సాయి కొర్రపాటి తదిరులతో పాటు చితృ బృందం పాల్గొంది. నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు... అవసరాల శ్రీనివాస్, హరీష్, శివనారాయణ, వాసు ఇంటూరి, ధన్య బాలకృష్ణ, సుచిత్ర, ఆహుతి ప్రసాద్, రావు రమేష్, కృష్ణ భగవాన్, చంద్రమోహన్, ఎల్బీ శ్రీరాం తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా - రసూల్ ఎల్లోర్, సంగీతం - శ్రీ, లిరిక్స్ - అనంత శ్రీరామ్, ఎడిటింగ్ - ధర్మేంద్ర, డ్యాన్స్ - విజయ్, గ్రాపిక్స్ - ఈ సి యస్, లాఫింగ్ డాట్స్, సహ నిర్మాత - సందీప్ గుణ్ణం, నిర్మాత - ఊర్మిళ గుణ్ణం, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - గంగరాజు గుణ్ణం.

Share this Story:

Follow Webdunia telugu