Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'ధూమ్-3' అమీర్‌ఖాన్: రజనీకి నేను వీరాభిమానిని

'ధూమ్-3' అమీర్‌ఖాన్: రజనీకి నేను వీరాభిమానిని
, గురువారం, 19 డిశెంబరు 2013 (17:17 IST)
PR
బాలీవుడ్ స్టార్‌హీరో అమీర్‌ఖాన్, బ్యూటీ క్వీన్ కత్రినా కైఫ్ జోడిగా నటించిన చిత్రం 'ధూమ్-3'. డిసెంబరు 20న ఈ సినిమా దేశవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ధూమ్ యూనిట్ బుధవారం చెన్నైలో సందడి చేసింది. ఈ సందర్భంగా హీరో అమీర్ ఖాన్ మాట్లాడుతూ...

సూపర్‌స్టార్ రజనీ సార్‌కి నేను పెద్ద అభిమానిని. నేను కెరీర్ ప్రారంభించిన కొత్తలో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం దక్కింది. 'అతంక్ కి ఆతంక్' చిత్రంతో ఆయనతో కలిసి పనిచేశాను. ఆయన చాలా మంచి వ్యక్తి అందరితో జాలీగా ఉండేవారు. ఆయనతో కలిసి నటించిన క్షణాలు నా సినీ కెరీర్‌లోని మధురానుభూతుల్లో కొన్ని అని అమీర్ రజనీతో ఉన్న అనుభందాన్ని గుర్తుచేసుకున్నాడు.

ధూమ్-3 సినిమా గురించి మాట్లాడుతూ... ఇందులో సర్కస్ ఆర్టిస్ట్‌గా చేశాను. సర్కస్ ఫీట్లు నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డాను. భారత్‌లో సర్కస్ అంటే జంతువులే ఎక్కువుగా ఉంటాయి. కానీ చాలా దేశాల్లో మునుషులే సర్కస్ ఫీట్లు చేస్తారు. నేను, కత్రినా ఇద్దరం చాలా కష్టపడి ఈ ఫీట్లు నేర్చుకున్నాం. అందరూ నా టోపీ గురించే అడుగుతున్నారు. 'ధూమ్-3'లో నా పాత్రలో టోపీ కూడా ఒక భాగం. షూటింగ్ ముగిసినా పెట్టుకోవాలనిపించి అదే కొనసాగిస్తున్నాను. బాగుంది కదా అని నవ్వుతూ ముగించారు.

Share this Story:

Follow Webdunia telugu