Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కమల్ హాసన్ - గౌతమిల బంధానికి పేరు లేదట....!

కమల్ హాసన్ - గౌతమిల బంధానికి పేరు లేదట....!
, సోమవారం, 26 ఆగస్టు 2013 (16:41 IST)
FILE
ఇద్దరూ భార్యాభర్తలు కారు ... కానీ కలిసుంటున్నారు. ఇద్దరికీ గతంలో పెళ్లిళ్లయ్యాయి ... కానీ ఇద్దరూ తమ భాగస్వాములతో విడిపోయి... ఇప్పుడు ఇద్దరూ కలిసుంటున్నారు. వారే కమల్ హాసన్... గౌతమి! మరి వీరి బంధాన్ని ఏమనాలి? అనడానికి ఏమీ లేదంటోంది గౌతమి. అసలు తమ బంధానికి ఎటువంటి పేరు లేదని చెబుతోంది గౌతమి.

సమాజంలో రకరకాల బంధాలు వున్నాయి. స్నేహితులు, ప్రేమికులు, భార్యాభర్తలు ... ఇలా బంధాలకు పేర్లున్నాయి. కానీ, కమలహాసన్‌తో తన బంధానికి మాత్రం పేరు లేదనీ, అసలు ఎటువంటి పేరూ పెట్టలేనని కూడా చెపుతోంది. తమలో తమకు ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవం వుంది. తను కేన్సర్ తో బాధపడిన సమయంలో భౌతికంగా, మానసికంగా కమల్ తనకిచ్చిన సపోర్ట్‌ని జన్మలో మరచిపోలేను అని అంటోంది గౌతమి. ఇలా పేరు చెప్పలేని బంధాలు కూడా ఉంటాయన్నమాట.

Share this Story:

Follow Webdunia telugu