Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రభాస్ - మ‌హేష్‌ - పవన్... ఆరడుగుల బుల్లెట్ ఎవ‌రు?

ప్రభాస్ - మ‌హేష్‌ - పవన్... ఆరడుగుల బుల్లెట్ ఎవ‌రు?
, సోమవారం, 26 ఆగస్టు 2013 (15:33 IST)
FILE
పవన్ కల్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమాలో వీడు ఆర‌డుగులు బుల్లెట్టూ....వీడు ధైర్యం విసిరిన రాకెట్టూ ... అంటూ వచ్చిన పాట సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఈ పాట ప‌వ‌న్ అభిమానుల నోట మారుమోగుతోంది. టీజ‌ర్ ఎప్పుడైతే బ‌య‌ట‌కు వ‌చ్చిందో - అప్పుడే ఫ్యాన్స్‌ని ఆక‌ట్టుకొన్న మాట - ఆర‌డుగుల బుల్లెట్‌!.

ఇప్పుడు ఈ ప‌దాన్ని క్యాష్ చేసుకొనే ప‌నిలో ప‌డ్డారు ఈ చిత్ర నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌. త‌న బ్యాన‌ర్‌లో ఆర‌డుగుల బుల్లెట్ అనే పేరు రిజిస్టర్ చేయించేశారు. అయితే ఇప్పుడు ఆరడుగుల బుల్లెట్ అనే సినిమాను ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ టైటిల్ మ‌హేష్‌బాబు సినిమా కోస‌మే అని ప్రచారం జ‌రుగుతోంది. దానికీ కార‌ణాలున్నాయి.

త్రివిక్రమ్ - మ‌హేష్‌బాబు కాంబినేషన్‌లో త్వర‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. దానికి ఈ పేరు వాడే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచార‌ం‌. త్రివిక్రమే స్వయంగా ఈ టైటిల్ నాకోసం అట్టి పెట్టండి అని నిర్మాత‌తో చెప్పార‌ట‌. మరోవైపు ప్రభాస్ - త్రివిక్రమ్ కాంబినేష‌న్‌లో సినిమా గురించి కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇంకా మరోసారి పవన్ కల్యాణ్‍‌తో త్రివిక్రమ్ ఈ టైటిలో రానున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఎవ‌రి సినిమా ముందు మొద‌లైతే ఈ టైటిల్ వారికి పెట్టే ఛాన్స్‌లు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే టాలీవుడ్‌లో ఆర‌డుగుల హీరోలలంటే వీళ్లే క‌దా?

Share this Story:

Follow Webdunia telugu