Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనుష్క లేలేత అందాలు... 'బాహుబలి' చిత్ర యూనిట్‌కు సెలవులు....!

అనుష్క లేలేత అందాలు... 'బాహుబలి' చిత్ర యూనిట్‌కు సెలవులు....!
, సోమవారం, 26 ఆగస్టు 2013 (13:45 IST)
FILE
అందాల భామ అనుష్క 'బాహుబలి' చిత్ర యూనిట్‌కు షాక్కిచ్చింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత 'బాహుబలి' సినిమా షూటింగులో జాయిన్ అయ్యింది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగు గత కొన్ని రోజులుగా హైదరాబాదు, రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ నేపధ్యంలో చాలా రోజుల తర్వాత చిత్ర యూనిట్‌కు అనుష్క కనిపించడంతో ఒక్కసారిగా షాక్ తిన్నారట. బొద్దుగా ఆంటీలా కనిపించే అనుష్క స్లిమ్‌గా ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్‌లా తయారయ్యిందట. 31లో పడ్డాక కూడా 16లను తలదన్నేవిదంగా కనిపిస్తూ ఫేస్ బుక్కులో సైతం మతి పోగొడ్తున్న సుందరి ఆమె.

రాజమౌళి చేతిలో పడిన హీరోయిన్ అందాలు కరిగిపోతాయనే టాక్ టాలీవుడ్ లోఉన్న విషయం తెలిసిందే. అయితే అందుకు బిన్నంగా ఈ బొమ్మళి తన ముదురు అందాలను లేలేతగా తయారుచేసుకొని, చిత్ర యూనిట్ సభ్యులకు, కెమెరామెన్ లాంటి వారికి సైతం నిద్ర లేకుండా చేస్తుంది.

అయితే ఈ విషయాన్ని పసిగట్టిన దర్శకుడు.. వెంటనే రెండు రోజలు షూటింగ్‌కు సెలవులు ఇచ్చినట్లు ఫిలింనగర్ వాసులు అంటున్నారు. అయితే చిత్ర యూనిట్ సభ్యులు ఆనందంగా డబుల్ ఆఫర్‌ను ఎంజాయ్ చేస్తున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అనుష్క లేలేత అందాలతో అందరికి సెలవులు దొరికాయని తెగ ఆనందపడిపోతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu