Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దీపిక పదుకొనే : నా బాయ్‌ఫ్రెండ్‌తో తిరుగుతున్న కత్రినా తరువాత నేనా?

దీపిక పదుకొనే : నా బాయ్‌ఫ్రెండ్‌తో తిరుగుతున్న కత్రినా తరువాత నేనా?
, సోమవారం, 19 ఆగస్టు 2013 (12:36 IST)
FILE
బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక పదుకొనే ఇప్పుడు చాలా బిజీగా ఉంది. షారుఖ్ ఖాన్‌తో తాజాగా నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే వంద కోట్ల కలెక్షన్స్ వచ్చేశాయి. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు చేతినిండా సినిమాలు ఉన్నాయి. మరో రెండు సంవత్సరాల వరకూ సరిపడే సినిమాలను ఒప్పుకుంది దీపిక.

ఎప్పుడూ టాప్ హీరోయిన్, టాప్ హీరోలపై టార్గెట్ పెట్టే బాలీవుడ్ మీడియా ఈ సారి కత్రినా తర్వాత ఎవరు టాప్ టూ హీరోయిన్ అనే దానిపై సర్వే పెట్టింది. ఈ సర్వేలో ఎక్కువ మంది దీపికకు ఓట్లు వేశారు. చివరిగా బాలీవుడ్ టాప్ టూ హీరోయిన్‌గా దీపిక ఎంపికైంది. రణబీర్ కపూర్... దీపిక పదుకొనేను వదిలేసి కత్రినా కైఫ్‌తో డేటింగ్‌లో ఉన్ విషయం తెలిసిందే. దీంతో నా మాజీ ప్రియుడుతో తిరుగుతున్న కత్రినా తర్వాత నన్ను ఎంపికచేశారా అంటూ మీడియాపై దీపిక ఫైర్ అయ్యిందట. దీంతో ఆ కార్యక్రమానికి తాను రానని దీపిక ఖరాఖండిగా చెప్పేసిందట.

Share this Story:

Follow Webdunia telugu