Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భవానీ ప్రసాద్ డైలాగులు మద్దెలచెర్వు సూరి చెప్పినవే

భవానీ ప్రసాద్ డైలాగులు మద్దెలచెర్వు సూరి చెప్పినవే
, గురువారం, 6 జనవరి 2011 (15:47 IST)
రొటీన్ ఫ్యాక్షన్‌కి దూరంగా తీసిన మా సినిమా మాస్‌గా కాక, మహిళా ప్రేక్షకులను కూడా మెప్పిస్తోంది. బి, సి సెంటర్లో వసూళ్లపరంగా అద్భుతాలు చేస్తోంది అన్నారు దర్శకుడు జీవీ సుధాకర్ నాయుడు. ఆయన దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా రూపొందించిన "రంగ ది దొంగ" ఇటీవల విడుదలైన విజయవంతంగా కొనసాగుతోంది.

విమలారామన్ ఈ చిత్రంలో కథానాయిక. సీఆర్ మనోహర్ నిర్మాత. విజయోత్సాహాన్ని పాత్రికేయులతో పంచుకుంటూ జీవీ మరిన్ని విశేషాలు ముచ్చటిస్తూ... శ్రీకాంత్ కెరీర్లోనే ఓ మైలురాయి ఈ చిత్రం. 100 సినిమాల హీరోగా ద్విపాత్రిభినయం... నటనపరంగా కొత్తగా అనిపించింది. ప్రథమార్థంలో రంగ(శ్రీకాంత్) బ్యాచ్ చేసిన కామెడీ, ద్వితీయార్థంలో రమ్యకృష్ణ నటన జనాలను మళ్లీమళ్లీ థియేటర్లకు రప్పిస్తున్నాయి.

ఈ సినిమాలో రమ్యకృష్ణ నటన జనాలను మళ్లీమళ్లీ థియేటర్లకు రప్పిస్తున్నాయి. ఈ సినిమాలో రమ్యకృష్ణ మరోసారి విశ్వరూపం చూపించారు. భవానీ ప్రసాద్ భార్యగా సురేఖ పాత్రలో మైమరిపించే అభినయం పండించారు. నరసింహ తర్వాత ఆ స్థాయి పాత్రలో నటించారని క్లాస్ సైతం మెచ్చుకుంటోంది. పాటలు వీక్షకుడిని 100 శాతం మెప్పిస్తున్నాయి. 12, 13 సంవత్సరాలుగా జైల్లో మగ్గిపోతున్న ఫ్యాక్షన్ బానిసలు... మా సినిమా చూసి మెచ్చుకోవడం మరింత ఆనందాన్నిస్తోంది. ఓ ఆరంభ దర్శకుడిగా పూర్తిస్థాయి సంతృప్తినిచ్చే ఫలితమిది అన్నారు.

సినిమాకి ముందు సూరిని కలిశా...
పగలు, కక్షలకోసం తమ మనుషుల్ని తామే మృగాలుగా మార్చేస్తున్నామని మద్దెల చెరువు సూరి ఆత్మస్తుతి చేసుకుంటూ నాతో అన్న మాటలనే... ఈ సినిమాలో యథాతథంగా ఉపయోగించాను. బెంగళూరు వెళుతూ... ఓసారి అనుకోకుండా విమానాశ్రయంలో కలిసినప్పుడు ఆయన ఈ మాటలన్నారు. సినిమాలో ఫ్యాక్షనిస్ట్ భవానీ ప్రసాద్ పాత్ర మంచివాడుగా మారడం అనేది సూరి మాటల ప్రభావమే.

తొలుత అనుకున్న స్క్రిప్టులో సైతం గురయ్యాక ఈ విషయాలను యాదృచ్ఛికంగానే మీ ముందుంచుతున్నాను అని జీవీ అన్నారు. రంగ పాత్ర ఎలా పుట్టింది అన్న ప్రశ్నకు సమాధానంగా ఓ లాయర్‌గా ఎందరినో చూశాను. ఆ పాత్రల్లోంచి పుట్టిందే రంగ పాత్ర అని ఆయన అన్నారు. తదుపరి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ... ఓ పెద్ద హీరోతో సినిమా ఉంటుందని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu