Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి రోజున ఎలా పూజ చేయాలి..

Webdunia
గురువారం, 5 నవంబరు 2020 (17:10 IST)
దీపావళి పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో అమావాస్య రోజున  వస్తుంది. దీపావళి పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి రోజున నరక చతుర్థశిగా జరుపుకుంటారు. ఆ రోజు మంగళ స్నానాలు చేస్తారు. హారతులు తీసుకుంటారు. ఈ పండుగకు కుమార్తెలను, అల్లుళ్ళని ఇంటికి ఆహ్వానిస్తారు. వారికి కానుకలు ఇచ్చి గౌరవిస్తారు. 
 
దీపావళి రోజున ఉదయం ఐదు గంటలకు లేచి, తలస్నానం చేసి పూజామందిరం ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరంలో అందమైన ముగ్గులతో తీర్చిదిద్దుకోవాలి. తెలుపు బట్టలు ధరించి... దైవమూర్తుల పటాలకు గంధము, కుంకుమలతో అలంకరించాలి.
 
ఆ తర్వాత ఆకుపచ్చని రంగుతో కూడిన కూర్చున్న శ్రీ లక్ష్మీదేవీ పటాన్నిగానీ, వెండితో తయారైన లక్ష్మీదేవి ప్రతిమను గానీ పూజకు సిద్ధం చేసుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్ర పద్మాలు, తెలుపు కలువ పువ్వులు, గులాబి పువ్వులతో లక్ష్మీదేవి అర్చించాలి.
 
జామకాయలు, రవ్వలడ్డులు, కేసరి బాత్, అరిసెలు వంటి పిండిపదార్థాలను నైవేద్యం పెట్టి శ్రీ లక్ష్మీ అష్టోత్తరము, శ్రీ మహాలక్ష్మీ అష్టకం స్తోత్రాలను పఠించాలి. అంతే కాకుండా శ్రీ సూక్తము, శ్రీ లక్ష్మీ సహస్రనామము, భాగవతము, కనకధారాస్తవము వంటి పారాయణ స్తోత్రాలతో లక్ష్మీదేవిని పూజించాలి. అందులో ముఖ్యంగా భాగవతములోని నరకాసురవధ అధ్యాయమును పారాయణము చేయాలి.
 
దీపావళి రోజున మహాలక్ష్మీ ధ్యానించి విశాఖ కనకమహాలక్ష్మీ దేవి, అష్టలక్ష్మీ దేవాలయం, కొల్హాపూర్ వంటి క్షేత్రాలను దర్శించుకుంటే సకల సంపదలు దరిచేరుతాయని విశ్వాసం. ఇదే రోజున కుంకుమ పూజ గావించిన స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తం చేకూరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
 
దీపావళి పర్వదినాన దేవాలయాల్లో శ్రీ లక్ష్మీ అష్టోత్తర నామ పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఐతిహ్యం. అంతేకాకుండా నరకాసురుని వధించిన దీపావళి రోజున లక్ష్మీ కుబేర వ్రతము లేదా వైభవలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే ఆ గృహంలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పెద్దలంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

మూర్ఖులు మారరా? భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

లేటెస్ట్

24 సంవత్సరాల తర్వాత జూలై 26న గజలక్ష్మీ యోగం.. ఏ రాశులకు అదృష్టం?

24-07-2025 గురువారం దినఫలితాలు - పిల్లల దూకుడు అదుపు చేయండి...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య నాడు జ్యోతిష్యం ప్రకారం ఈ యోగాలు

జూలై 23న మాస శివరాత్రి.. ఆరుద్ర నక్షత్రం తోడైంది.. సాయంత్రం శివాలయంలో?

23-07-2025 బుధవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి...

తర్వాతి కథనం
Show comments