స్కూటీపై వెళుతున్న వివాహితకు నిప్పంటించిన అకతాయి... మంటల్లో కాలుతూనే...

ఠాగూర్
మంగళవారం, 9 సెప్టెంబరు 2025 (10:47 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి చోటుచేసుకుంది. స్కూటీపై వెళుతున్న ఓ వివాహితపై అకతాయి ఒకడు నిప్పంటించాడు. ఈ క్రమంలో బాధితురాలు మంటల్లో కాలుతూనే స్కూటీని నడుపుకుంటా ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ నుంచి మరో ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు, ఈ నెల 6వ తేదీన లక్నో సమీపంలో ఉన్న ఫరూఖాబాద్‌లో నిషా సింగ్ (33) అనే వివాహితను దీపక్ అనే వ్యక్తి గత రెండు నెలలుగా వేధింపులకు గురిచేస్తున్నాడు. తనతో మాట్లాడమంటూ ఆమెపై ఒత్తిడి తెస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల నిషా తన తండ్రి ఇంటికి వచ్చింది. అక్కడ నుంచి వైద్యుడు వద్దకు వెళ్లేందుకు ఆమె స్కూటీపై బయలుదేరంది. 
 
దీన్ని గమనించిన దీపక్ ఆమె స్కూటీని అడ్డగించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో దీపక్, అతడి స్నేహితులు కలిసి నిషాకు నిప్పంటించారు. దీంతో ఆమె బిగ్గరగా కేకలు వేస్తూ స్కూటర్ నడుపుకుంటూ సమీపంలోని ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి, మరో ఆస్పత్రికి తరలిస్తుండగా నిషా ప్రాణాలు కోల్పోయింది. 
 
బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. తన కుమార్తెకు నిప్పంటించింది దీపక్ అని, అతన్ని కఠినంగా శిక్షించాలని మృతురాలి తండ్రి డిమాండ్ చేస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments