టీచర్‌ని ప్రేమించిన స్టూడెంట్.. చీర కట్టుకుని వచ్చింది.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు

సెల్వి
బుధవారం, 20 ఆగస్టు 2025 (15:14 IST)
teacher
కలియుగం.. వావి వరుసలు, వయోభేదం లేకుండా ప్రేమలు పుట్టుకొస్తున్నాయి. ప్రేమ అనే పదానికి నిర్వచనం ఏంటనేది చాలామందికి మరిచిపోయినట్లు ప్రస్తుత వ్యక్తులు ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ విద్యార్థి టీచర్‌ని ప్రేమించాడు. కానీ ఆమె ప్రేమకు నిరాకరించడంతో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. 26ఏళ్ల బాధితురాలు ఓ ప్రైవేట్ పాఠశాలలో గెస్ట్ టీచర్‌గా పనిచేస్తున్నారు. నిందితుడు సూర్యాంశ్ కోచర్ (18) గతంలో అదే పాఠశాలలో చదువుకున్న మాజీ విద్యార్థి. సూర్యాంశ్ గత రెండేళ్లుగా టీచర్‌ను ప్రేమిస్తున్నాడు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా టీచర్ చీరలో స్కూల్‌కు వచ్చారు. ఆమెతో సూర్యాంశ్ అసభ్యకరంగా మాట్లాడారు. దీనితో టీచర్ అతనిపై పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. 
 
ఈ ఫిర్యాదుపై ఆగ్రహించిన సూర్యాంశ్ కక్ష పెంచుకున్నాడు. అంతే టీచర్‌పై ఆగస్టు 18వ తేదీన పెట్రోల్ పోశాడు. నిప్పంటించేశాడు. ఆమె కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. 
 
ఆమెకు సుమారు15 శాతం కాలిన గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కొన్ని గంటలు పరారీలో వున్న సూర్యాంశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments